AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి…

1 min read

AABNEWS : సాయుధ దళ కార్యాలయంలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంను నక్సల్స్‌ ప్రభావ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. సరిహద్దుల్లో ఎక్కడా మావోయిస్టుల కదలికలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్యలను మరింత విస్తృతం చేసి లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన డీజీపీ కొత్తగూడెం హేమచంద్రాపురంలోని జిల్లా సాయుధ దళ పోలీస్‌ కార్యాలయంలో ఫైరింగ్‌ రేంజ్‌, బీఓఏసీ ట్రాక్‌, పరేడ్‌ మైదానాలను బుధవారం ప్రారంభించారు. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాలో పోలీస్‌ వ్యవస్థకు సంబంధించిన అన్ని సౌకర్యాలను సమకూర్చడంలో ఎస్పీ సునీల్‌దత్‌ కృషి ప్రశంసనీయమన్నారు. మావోయిస్టు రహిత జిల్లా లక్ష్యంగా గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ, ఇతర విభాగాల సిబ్బందికి ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఫైరింగ్‌ రేంజ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఎస్పీ, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) తిరుపతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విధి నిర్వహణలో నిబద్ధతను ప్రదర్శిస్తున్నారన్నారు. అంకితభావంతో పనిచేస్తున్న వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో గ్రేహౌండ్స్‌ అడిషనల్‌ డీజీపీ కె.శ్రీనివాసరెడ్డి, నార్త్‌జోన్‌ ఐజీ వై.నాగిరెడ్డి, ఐజీ ఎస్‌ఐబీ ప్రభాకర్‌రావు, ఎస్పీ సునీల్‌దత్‌, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఓఎస్‌డీ తిరుపతి, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ బి.కృష్ణయ్య, భద్రాచలం ఏఎస్పీ వినీత్‌, ఇల్లెందు, పాల్వంచ డీఎస్పీలు రవీందర్‌రెడ్డి, కేఆర్‌కే ప్రసాదరావు, సీఐ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు చేరుకున్న డీజీపీకి జిల్లా పోలీసు అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆయన ప్రధాన ముఖ ద్వారం వద్ద అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఫైరింగ్‌ రేంజ్‌ను ప్రారంభించారు. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు డీజీపీ బుధవారం గుండాల ఠాణాను సందర్శించారు. సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రమేశ్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉన్నతాధికారులతోపాటు మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ నరేశ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. డీజీపీ మాట్లాడుతూ జిల్లాలో నక్సల్స్‌ కదలికలు లేకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంట సేపటి తర్వాత ఆయన తిరిగి హెలికాప్టర్‌లో ములుగు జిల్లాకు బయల్దేరి వెళ్లారు.

 292 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.