AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భర్త కోసం భార్య ఆత్మహత్య

1 min read

AABNEWS : భర్తను మర్చిపోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. బౌద్ధనగర్‌ డివిజన్‌ మహ్మద్‌గూడకు చెందిన శ్రీనివాస్‌(38), హేమలత (32)లు భార్యభర్తలు. వీరికి ఐశ్వర్య (10), అభిలాష్‌ (08) ఇద్దరు పిల్లలు. వెల్డింగ్‌షాపు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ రెండునెలల క్రితం బ్రెయిన్‌స్ట్రోక్‌ రావడంతో గతేడాది నవంబరు 17న మృతి చెందాడు. భర్త మృతి చెందడంతో భార్య హేమలత తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అభిలాష్‌ చూడగా తల్లి ఉరికి వేలాడుతూ కనిపించింది. చిన్నారి ఏడుస్తు ఫ్యానుకు అమ్మ వేలాడుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. భర్త మరణాన్ని తట్టుకోలేక హేమలత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 121 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.