భవనం శంఖుస్థాపన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి…
1 min read
AAB NEWS : వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం లోని నర్సాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీకి భూమి పూజ మరియు శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరైన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మరియు అనంతరం ప్రభుత్వం నిధులచే నూతన గ్రామ పంచాయతీ భవనo మంజూరు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే దౌల్తాబాద్ మండల కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో శ్రీ చెన్నకేషవ ఫంక్షన్ హాళ్ళో సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ విజయ్,వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,గ్రామ సర్పంచ్ శిరీష రమేష్, నర్సాపూర్ సర్పంచ్ ఆర్ హేమలత, నర్సింలు, జడ్పీటీసీ కోట్ల మహిపాల్,అధికారులు ఎంపీడీఓ తిరుమల స్వామి,తహసీల్దార్ చాంద్ పాషా,వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు, తెరాస నాయకులు,కార్యకర్తలు మరియు వికలాంగుల ట్రస్ట్ సభ్యులు వెంకట్ రమణ, మరియు దస్టాప్ప,తదితరులు పాల్గొన్నారు.

34 Total Views, 2 Views Today