November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం

1 min read

ఈ రోజు భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పట్టణశాఖ కార్యవర్గ సమావేశం పట్టణ శాఖ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిచటం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రాంబాబు గారు హాజరై పార్టీ బలోపేతం గురించి మునిసిపల్ సమస్యలపై వారు మాట్లాడుతూ అయోధ్య రామమందిరం నిధి సేకరణలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని రాముని సేవలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని రాముని ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరికి చెప్పటం జరిగింది . అదేవిధంగా పూర్తి బూత్ కమిటీలు మరియు పట్టణ కమిటీలు పూర్తిచేయాలని చెప్పటం జరిగింది. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక భూపాలపల్లి మునిసిపాలిటీ సమస్యలపై మాట్లాడుతూ ముఖ్యంగా ప్రతి కాలనిలో కోతులు మరియు కుక్కలు వీటి బెడద చాలా ఎక్కువగా ఉన్నది. అదేవిదంగా రానున్నది వేసవి కాలం కనుక ఇప్పటికే తగునీటి సమస్య తో ఇబ్బంది పడుతున్న భూపాలపల్లి పల్లి ప్రజలు పట్టించుకోని భూపాలపల్లి ప్రజా ప్రతినిధులు, అధికారులు అదేవిదంగా పకీర్ గడ్డ,ఆకుదరివాడ, గడ్డిగానీపల్లి,శాంతినగర్, కాకతీయ కాలనీ ప్రజలు ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ ,దెబ్బాలవలన డస్ట్ వల్ల నానా వ్యాధులకు గురవుతున్న కాలనీవాసులు కానీ ఇప్పటివరకు స్పందించని ప్రజాప్రతినిధులు, అధికారులు, సింగరేణి సంస్థ. అదేవిదంగా డబులబెడ్ రూమ్ లు పూర్తయి రెండు సంవత్సరాలు గడిచినప్పటికి ఏఒక్క లబ్ది దారునికి ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవు, భూపాలపల్లి లో వంద పడకల ఆసుపత్రి పూర్తి ఐ రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంత వరకు ఓపెన్ చేయకపోవడం బాధాకరమని చెప్పడం జరిగింది. అదేకాకుండా భూపాలపల్లి లో ఇంతవరకు మహిళా పోలీస్టేషన్ లేకపోవడం బాధాకరం అని అన్నారు.
ప్రతి ఒక్క టి శిలపాలకని తప్ప ప్రజలకు మేలుచేసే విదంగా ఏ ఒక్క విషయం లోనయిన టి ఆర్ ఎస్ (TRS) ప్రభుత్వం చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు.రానున్న రోజుల్లో ప్రజలు TRS ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తారని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ముత్యాల శ్యాం, పట్టణ ప్రధాన కార్యాదర్శి తుమ్మెటి రాంరెడ్డి, డాక్టర్ సెల్ అధ్యక్షులు కర్ర జైపాల్ రెడ్డి గారు,జిల్లా నాయకులు కందాడి సత్తి రెడ్డి గారు, ఉపాధ్యక్షులు తోట ఓదేలు,ఊరటి మునెందర్,పడకంటి పురుషోత్తం,బోయిని అనిల్,పట్టణ కార్యదర్శి గజ్జె భారతీయుడు,పట్టణ అధికార ప్రతినిధి గోగుల శ్రీనివాస్ రెడ్డి,జిల్లా OBC కార్యదర్శి సుర మైపాల్, చిట్యాల ప్రవీణ్, కనికుంట్ల నరేష్, మిద్దెపాక మోహన్ ,జోగుల కుమార్, గోగులోతు వినోద్,పట్టణ మహిళ మోర్చ అధ్యక్షురాలు కడారి మాలతి, ప్రధాన కార్యదర్శి రంగనాయకుల ప్రవళిక, ఉపాధ్యక్షురాలు ఈర్ల మల్లిక ,చామంతి,స్వప్న, కార్యదర్శి స్వరూప మరియు బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 396 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.