భారత్ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ
1 min read
AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సం. లు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం
75 వారాల పాటు “భారత్ కా అమృత్ మహోత్సవ్” పేరిట వచ్చే సం. ఆగస్ట్ 15 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సింగరేణిలో కూడా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.భారత్ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను భూపాలపల్లి ఏరియాలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. జి యం కార్యాలయంలో జరిగిన ప్రధాన కార్యక్రమానికి ఏరియా జంరల్ మేనేజర్ శ్రీ ch NIREEKSHAN రాజ్ గారు ముఖ్య అతిదిగా విచ్చేసి దేశ నాయకుల చిత్ర పటాలకు పూల మాలలు వేసి
నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సంధర్భంగా జి యం గారు మాట్లాడుతూ – ఎందరో స్వాతంత్ర సమరయోదుల త్యాగాల వలన
మన స్వేచ్చా భారతావని రూపు దిద్దుకుందని తెలిపారు. దేశ పౌరుల్లో జాతీయ భావం పెంపొందించడానికి
ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశ వ్యాప్తంగా భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం
మార్చి 12 వ తేదీన ప్రారంభం అయిందని ఇందుకు కారణం 1930 వ సం లో మహాత్మా గాంధీజీ మార్చ్
12 న ఉప్పు సత్యాగ్రహానికి పూనుకోవడం జరిగిందని తెలిపారు. నేటి యువత స్వతంత్ర్య సమరయోధుల
త్యాగ నిరతి ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
అనంతరం జి యం కార్యలయం నుండి అంబేడ్కర్ చౌరస్తా వరకు భారత్ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీలో శ్రీ విజయ్ – SO to GM గారు, శ్రీ ఎస్ జోతి – AGM (IED)గారు, శ్రీ బి రవీందర్ ASO గారు, శ్రీ జాన్ ఆనంద్ – PO KTK OC2 గారు, జియం ఆఫీస్ ఇతర అధికార బృంధం, జి యం కార్యాలయ సిబ్బంది, సింగరేణి పాఠశాల విద్యార్థులు S & PC సిబ్బంది మరియు TBGKS గారు, శ్రీ ఎం రమేష్ – AITUC గారు యూనియన్ నాయకులు శ్రీ కొక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారని ఏరియా అధికార ప్రతినిధి శ్రీ ఎస్ అనిల్ కుమార్ గారు తెలియజేశారు.
672 Total Views, 2 Views Today