AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భూపాలపల్లి మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం వాయిదా

1 min read


ఈరోజు భూపాలపల్లి లో మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం అధికార పార్టీ కౌన్సిలర్లు రానందున వాయిదా వేశారు. ఈ సందర్భంగా AIFB పార్టీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలో అభివృద్ధి జరగడం లేదు వార్షిక బడ్జెట్ లో సంవత్సరం లో అభివృద్ధి ఎలా చేయాలి భూపాలపల్లి పట్టణంలో పనులు ఏ విధంగా చేయాలని చర్చించాల్సిన సమయానికి అధికార పార్టీ కౌన్సిలర్లు మాకు ఏం పట్టనట్టు మాకు ఈ సమావేశానికి ఏం సంబంధం లేదు అని ఎవరికి వారు రాలేదు ఇలాగైతే భూపాలపల్లి అభివృద్ధి ఎటుపోతుంది ఇప్పటికే కాలనీల్లో పలు సమస్యలు పెరిగిపోయాయి పట్టించుకున్న నాథుడే లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఇదిలా ఉంటే 89 రోజులకు 30 మంది శానిటేషన్ సిబ్బంది ని తీసుకోమని గతంలో కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది కానీ ఎనభై తొమ్మిది రోజులు గడిచిపోయాయి అయినప్పటికీ మళ్ళీ వారిని కొనసాగించడం జరుగుతుంది మళ్లీ కౌన్సిల్ తీర్మానం పెట్టినాక తీసుకోవాలి కానీ అలా చేయకుండా వారినే కొనసాగించడం జరుగుతుంది అలాగే అధికార పార్టీ కౌన్సిలర్ల కొడుకులు బంధువులు కూడా పని చేయడం జరుగుతుంది. ఇది కేవలం మరి సానిటేషన్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వీరు ఆఫీస్ వర్క్ చేస్తున్నారు ఇది చట్టరీత్యా నేరం ఈరోజు మేము అడుగుతామని దొంగ లెక్క పారిపోయి ఈరోజు రాలేదు కావున మరి కలెక్టర్ గారు ఇవన్నీ గమనించి వెంటనే వారిపై చర్యలు తీసుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వారిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని AIFB కౌన్సిలర్ గా మేము డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఇలా జరిగితే భూపాలపల్లి అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటది కాబట్టి చర్య తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం. మున్సిపాలిటీ లో లక్షలు పెట్టి వాహనాలు తీసుకొని వాటిని ఇప్పటి వరకు నెలలు గడుస్తున్నా వాడుకలోకి తీసుకురావడం లేదు.
శానిటేషన్ సిబ్బంది ని నోటిఫికేషన్ ద్వారా తీసుకోవాలని, దీనికి ప్రత్యేకంగా కమిటీ వేసి కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో AIFB కౌన్సిలర్లు ఉడుత సరోజన, కుర్మిల్ల రజిత పాల్గొన్నారు.

 504 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.