AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భూపాలపల్లి లోని బిట్స్ లో ప్రవేశం ఎలా?

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

శ్రీయుత గౌరవనీయులైన తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా.. ఈ విద్యా సంవత్సరం అనగా 2021-22 విద్యా సంవత్సరమునకు సంబంధించిన ఆన్లైన్ క్లాసులు వచ్చే వారం ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. గత విద్యా సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు ఆన్లైన్ క్లాసులు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు బోధించుటకు మేము సన్నద్ధమవుతున్నాము. కావున మీ యొక్క పిల్లలను సరైన సమయంలో ఆన్లైన్ క్లాసులు వినుటకు సిద్ధంగా ఉంచండి. మీయొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఆన్లైన్లో క్లాసులు బోధించుటకు సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు కూడా మీ యొక్క పిల్లలకు సరైనటువంటి పరికరాలు అనగామొబైల్ ఫోన్, టెక్స్ట్ బుక్స్ సిద్ధంగా ఉంచి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలరని మా యొక్క మనవి. గత విద్యా సంవత్సరమునకు సంబంధించిన తరగతులను కొంతమంది విద్యార్థులు వినియోగించుకోలేదు. దాని ద్వారా పిల్లలకు ఎలాంటి విజ్ఞానం అనేది రాదు. దీని యొక్క ప్రభావం భవిష్యత్తులో పోటీ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సంపాదించడంలో మీ పిల్లలకు ఎలాంటి అవకాశం అనేది ఉండదు. ఎందుకనగా వాళ్లు సక్రమంగా క్లాసులు వినలేదు కాబట్టి ,వారికి సరైన విజ్ఞానం అనేది లభించలేదు. ఆన్లైన్ క్లాసులు ద్వారా ఎంతో కొంత విజ్ఞానం అనేది మీ పిల్లలకు లభిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క పిల్లలను ప్రతిరోజు ఆన్లైన్ క్లాసులకు వచ్చే విధంగా సన్నద్ధ పరచాలని మా యొక్క విన్నపం. ప్రభుత్వం అధికారికంగా విద్యాసంవత్సరం ప్రకటించిన వెంటనే దానికి అనుగుణంగా మన యొక్క పాఠశాల నడిపిస్తామని మీకు తెలియజేస్తున్నాం… అది ఆన్లైన్ క్లాసులు అయినా సరే లేదా ప్రత్యక్ష క్లాసులు అయినా సరే మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. కావున మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీ పిల్లలకు సహకరిస్తూ అలాగే మా పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతూ ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ పరిసర ప్రాంతంలో కానీ, మీ బంధువుల లో కానీ ఎవరైనా విద్యార్థులు ఉంటే మాకు అడ్మిషన్ చేయించగలరని మా యొక్క మనవి. అడ్మిషన్ కొరకు ఈ క్రింది నెంబర్ కు ఫోన్ చేయండి..
సదా మీ సేవలో…
ప్రిన్సిపాల్ : 9154698475
బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్(BITS)
భూపాలపల్లి.

 1,409 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.