AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మంత్రి సోమిరెడ్డి కామెంట్స్…

1 min read

AABNEWS : రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కుటుంబాలతో సహా రోడ్డెక్కి 365 రోజులుగా పోరాడుతున్నారు..ఆనాడు నిండుసభలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, శంకుస్థాపన రోజు ప్రధాని ముగ్గురూ ఒకే మాట మాట్లాడితే నమ్మి రైతులు భూములిచ్చారు..రైతులు రోడ్డెక్కి పోరాడుతున్నా..ముఖ్యమంత్రి మనస్సు కరగకపోవడం దురదృష్టకరం.ఇకపై ప్రభుత్వంతో ఒప్పందం అంటే నమ్మకం పోయే పరిస్థితి.. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మొండిగా పోకుండా 13 జిల్లాలకు కేంద్రమైన అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. రాజధాని కోసం పోరాడుతున్న మన ఆడపడుచులను పోలీసుల బూటు కాళ్లతో తన్నించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు..వాళ్ల గుండెలు కరిగిపోతున్నాయి..మిమ్మల్ని క్షమించరు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి. మరో వైపు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశంలోని రైతులందరూ పోరాడుతున్నారు. రైతుల పోరాటాన్ని చూసి చలించిపోయి సిక్కు మత ప్రబోధకుడు సంత్ బాబా రాంసింగ్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం సమస్యను డీల్ చేయలేకపోతే మేమే రైతు నాయకులతో కమిటీ వేస్తామని సాక్షాత్తు సుప్రీం కోర్టే నిర్ణయం తీసుకునే పరిస్థితి ప్రధాని మోదీ ఎందుకు తెచ్చుకోవాలి. రైతులకు న్యాయం చేసే విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తే మీకు పోయేదేం లేదు..ప్రిస్టేజ్ కి పోకండి. వెంటనే ఒక మెట్టుదిగి చట్టాలను సవరించి రైతులను మెప్పించాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉంది..రైతుల విషయంలో ఇటు సీఎం, అటు పీఎం మంచి మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా..లేకపోతే ప్రజలు క్షమించరు..

 36 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.