మదర్ థెరిస్సా రాష్ట్రస్థాయి సేవా పురస్కారం 2021అందుకున్న ఉమర్ ఫారూఖ్ ఖాన్నెల్లూరు పట్టణం లోని టౌన్ హాల్ ఫంక్షన్ హాల్ వేదికగా….
1 min read
AABNEWS : మదర్ థెరిస్సా రాష్ట్రస్థాయి సేవా పురస్కారం 2021అందుకున్న ఉమర్ ఫారూఖ్ ఖాన్నెల్లూరు పట్టణం లోని టౌన్ హాల్ ఫంక్షన్ హాల్ వేదికగా అచరిత్వ ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అచరిత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు కృపాల్ గారి అధ్యక్షతన జరిగిన మదర్ థెరిస్సా రాష్ట్ర స్థాయి 2021సేవా పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణా&ఆంధ్రప్రదేశ్ కు చెందిన వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభా వంతులకు ముఖ్య అతిథులు డాక్టర్ ఉషా కిరణ్ iRSజీఎస్టీ అసిస్టెంట్ కమీషనర్ అధికారి .పాస్టర్ డేవిడ్ దయాస్వేదవల్లి .మైనార్టీ ఉద్యమ నాయకులు సమీహుసైనీ.రిటైర్డ్ ఎస్పీ రాజశిఖా మణి .విశిష్ఠ అతిథులు పురస్కారo అందజేశారు కార్యక్రమంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ . మదర్ థెరీస్సా రాష్ట్రస్థాయి -2021పురస్కారం అందుకున్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దాదాపు 20సంవత్సరాల నుంచి 51సారి రక్తదానం చేసి వందలాది రక్తదాన చైతన్య కార్యక్రమాలు చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు కోవిడ్ శవాలను కుల మతాలకు అతీతంగా వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూ శుభ కార్యాలలో మిగిలిన ఆహారపదార్థాలు అన్నార్తులకు అందజేస్తూ మతోన్మాద కులోన్మాద తీవ్రవాద నిర్మూలనా కార్యక్రమాలు మత సామరస్య పరమత సహనం సోదరభావం వసుధైక కుటుంబం పెంపొందించే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవలకు సామాజిక చైతన్య కార్యక్రమాల కు గుర్తింపుగా జాతీయ స్థాయిలో ఢిల్లీ లో 2019జ్యోతీరావు పూలే జాతీయ పురస్కారం.ఉత్తమ రక్తదాత పురస్కారం కలెక్టర్ వీరపాండ్యన్ గారి చేతుల మీద ఉగాది సాహిత్య పురస్కారం.అనంత సాహిత్య పురస్కారం.జనవిజ్ఞాన వేదిక ద్వారా రాయలసీమ సేవా రత్నం పురస్కారం .ఫెర్రర్ గారి చేతులమీద సేవా పురస్కారం.2018బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పురస్కారం.2019అంబేద్కర్ మనుముడు రాజరత్న అంబేద్కర్ చేతులమీద అంబేద్కర్ రత్న జాతీయ సేవా పురస్కారం.దాదాపు వందకు పైగా పురస్కారాలు సామాజిక సేవలకు గాను అందుకున్నానని ఇక ముందుకు కూడా సేవలు కొనసాగిస్తూ రాష్ట్రమంతటా మత సామరస్యం .పరమత సహనం.సోదరభావం. పెంపొందించటానికి ఆచరణాత్మక ప్రయత్నం కొనసాగిస్తానని నా సేవలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కవులు రచయితలు మేధావులు సామాజిక సేవకులు వందలాది మంది పాల్గొన్నారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కు అభినందనలు తెలిపారు
598 Total Views, 2 Views Today