AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ మహనీయుని ఆశయాలను కొనసాగిద్దాం…

1 min read

AABNEWS :మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ మహనీయుని ఆశయాలను కొనసాగిద్దాం… మహబూబాబాద్,ఏప్రిల్ సమాజంలో అసమానతలు తొలగింపుకై కృషిచేసిన మహనీయుని ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ కోరారు.సోమవారం బాబు జగజ్జివన్ రాం 114వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న విగ్రహానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డితో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగింపు కొరకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బీహార్ నుండి పాల్గొని, కార్మికశాఖ మంత్రిగా పనిచేస్తూ భారత, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో రక్షణ శాఖామంత్రి గా, హరిత విప్లవంలో భాగంగా వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంలో పలు మార్పులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. కోవిడ్ వలన కార్యక్రమాలు జరుపుకోలేక పోతున్నామన్నారు.రెండో విడత కరోన విజృంభిస్తున్నదని, మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలుకు తావివ్వరాదన్నారు. విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగింప జేస్తామన్నారు.సమాజంలోఅందరం సమానమేనని, కలిసి మెలిసి పనిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగంకు సహకరించాలని కోరారు. ఈ జయంతి ఉత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి రావూరి రాజు, జిల్లా అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కామ సంజీవరావు, టి ఎం ఆర్ పి ఎస్ కొండ ఎల్లయ్య, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్ ,గిరిజన సామాజిక వేదిక అధ్యక్షులు గుగులోతు కిషన్నాయక్, కెవిపిఎస్ నాయకులు దుడ్డేల రామూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

 159 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.