AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహిళలకు గౌరవం ఏది

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత:) అని ఆర్యోక్తి. మాతృదేవో భవ: అనే సనాతన ధర్మానికి నెలవు భారతదేశం. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి. పోలీసులున్నారు. చట్టాలున్నాయి. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్థరాత్రి అన్నాడు. కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపురించింది.పెద్దపెల్లి జిల్లా మంతిని పట్టణంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం డైరెక్టర్ రాణి గారిని అవమానపరిచిన పూజారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ కోరడం జరిగింది నేటికి రోజులు గడుస్తున్నా దేవాలయం డైరెక్టర్ ను అవమానపరిచిన పూజారి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పి మాహాదేవ్పూర్ మండల మహిళా అధ్యక్షురాలు అన్నమానేని అరుణ ,మరియు మహిళ కార్యకర్తలు మహిళలపై జరుగుతున్న అవమానాలను తీవ్రంగా ఖండిస్తూ పూజారిని వృత్తి నుండి తొలగించి అతని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

 2,253 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.