మాణికం ఠాగూర్ గరం గరం…
1 min read
AAB News : హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాజపా నాయకుల భాష సరిగా లేదని.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తెరాస, భాజపా వ్యవహారం గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీలా ఉందని వ్యాఖ్యానించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత విధ్వేషాలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంతో కీలకమని.. తప్పకుండా మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెరాస అవినీతిపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. వరదసాయం పేరుతో తెరాస నేతలు వారి జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చి తెరాస ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతురు.. కానీ, ఎందుకు సీబీఐ విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ప్రశ్నపై ఠాగూర్ స్పందించారు. ఆమె కాంగ్రెస్‌లోనే ఉన్నారని స్పష్టం చేశారు. భాజపా తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
తెరాస, భాజపా స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్ విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని భాజపా చెడగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
62 Total Views, 2 Views Today