మానవత్వాన్ని కనబరిచిన కృష్ఞాజిల్లా పోలీసులు…
1 min read
AABNEWS : మావి దండించే చేతులే కాదు.. సాయం చేసే చేతులు కూడా అని నిరూపించిన చల్లపల్లి పోలీసులు. ఖాకీ దుస్తులు వెనుక ఖాటిన్యమే కాదు సహాయం లో ఉన్న ప్రజలకు మానవత్వంతో సేవ చేయగలరు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం శిక్ష ఎలా వేస్తారో, నిరాశ్రయులకు, సహాయం కోసం వచ్చే వారిపై కరుణ చూపి సహాయం అందించగల నేర్పు పోలీసుల సొంతం. కరుకైన పోలీస్ గుండెల వెనుక మానవత్వం దాగుందని చేసిన చల్లపల్లి సీఐ వెంకట నారాయణ.గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఘంటసాల మండలం లంకపల్లి ప్రాంతంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా పాల వాహనం ఢీకొని, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండగా, అతన్ని మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వర రావు మృతి చెందగా, ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేశ్వరరావు భార్య సుభాషిని తన ఇద్దరు పిల్లలతో గుడివాడ పుట్టింటి నందు ఉంటుండగా, ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే తన పిల్లలతో గుడివాడ నుండి చల్లపల్లి చేరుకొంది. అప్పటికే సమయం అర్ధరాత్రి 11 గంటలు దాటడం తో ఎటువంటి వాహనాలు లేక పిల్లలతో స్థానిక చల్లపల్లి సెంటర్లో భర్త మరణించిన బాధలో బిక్కు బిక్కు మంటూ, ఎటూ పాలుపోలేనీ దీన స్థితిలో కూర్చున్న సుభాషినినీ, ఇద్దరు పిల్లలను రాత్రి గస్తీ నిర్వహిస్తున్న చల్లపల్లి సిఐ వెంకట నారాయణ గమనించి సమాచారం తెలుసుకుని, స్వయంగా తన పోలీస్ వాహనంలో ఆమెను లంకపల్లి వెంకటేశ్వరరావు ఇంటికి తీసుకువెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విధినిర్వహణలో ఎంత కటువుగా ఉన్నా, సహాయం లో ఉన్న నిరాశ్రయులు ఎవరైనా కనబడితే వెనకడుగు వేయకుండా మానవత్వంతో అందిస్తారని మరొకసారి రుజువు చేసిన చల్లపల్లి సిఐ గారికి,పోలీసు సిబ్బంది ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు…
349 Total Views, 2 Views Today