AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మెడికల్ కళశాల కోసం అఖిలపక్షం సమావేశం…

1 min read

AABNEWS : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకు చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం అన్ని మౌలిక వసతులు వున్న గద్వాలను జిల్లా చేయకపోవడంతో సంవత్సరం పాటు ప్రజా సంఘాలు, ప్రజలు, గద్వాల జెఎసి లు సంఘటితమై గద్వాల జిల్లాను ఉద్యమాల ద్వారా సాధించుకోవడం జరిగింది. నేడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ జిల్లాలో అత్యంత వెనకబడ్డ ప్రాంతం అక్షరాస్యతతో పాటు ఆర్ధికంగా లేక వలసపోయి కడుపునింపుకొనే పరిస్థితి అనారోగ్య పరిస్థితి దాపరిస్తే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్,మహబూబ్ నగర్, వెళ్లే పరిస్థితి అక్కడికి వెళ్లే లోపు ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకం,ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ను ఆశ్రయించే వారు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో పేదవారికి ఆరోగ్య శ్రీ వర్తించక ప్రవేటు ఆసుపత్రిలో చూయించలేక మధ్యలోనే ప్రాణాలు హరి అంటున్నాయి.స్వరాష్ట్రం లో ఇన్ ఛార్జ్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆయా జిల్లాలో ఉండే రవాణా, రైల్ మార్గం, మెండుగా ప్రభుత్వ స్థలాలు ఉండే ప్రదేశాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి, నాడు ఎవరి ప్రాంతం వారు అభివృద్ధి చేసుకొనే స్వార్ధ బుద్ధితో మెల్గడం వల్ల ఆయా పార్టీలపై ప్రజల విశ్వాసం పోగొట్టుకొంటున్నారు.త్వరలో గద్వాల జిల్లాలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసి ప్రజల విశ్వాసం పొందాలని లేనిపక్షంలో అఖిలపక్షం గా భవిష్యత్ కార్యాచరణ ద్వారా ఉద్యమాలకు మరోసారి సిద్ధంగా ఉండాలని గద్వాల ప్రజలను కోరారు.…

 1,451 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.