భర్తను జెండా కర్రకు కట్టేసి…
1 min read
AABNEWS : ఆమె ఇంట్లో అణుకువగా ఉండే ఇల్లాలు. పిల్లలే తన సర్వస్వం. పేద కుటుంబం కావడంతో కాపురంలో కలతలు ఉన్నా..గుట్టుగా కష్టాలు భరిస్తూ ముందుకు సాగేది. కానీ భర్త రోజు తాగొచ్చి వేధిస్తున్నాడు. తనతో పాటు పిల్లల్ని కూడా కొడుతున్నాడు..తిడుతున్నాడు. పెద్ద మనుషులతో చెప్పించింది. మాట వినలా. పోలీసుల వద్దకు వెళ్లి సమస్య చెప్పుకుంది. వారు కౌన్సిలింగ్ ఇచ్చినా దారికి రాలేదు. వేధింపులు అంతకంతకూ పెరిగిపోయాయి. దీంతో విసుగు చెందిన ఆమె..సోమవారం భర్తను పంచాయితీ ఆఫీసు వద్దకు లాక్కొచ్చింది. అక్కడి జెండా కర్రకు కట్టేసి చితకబాదింది. ఇన్నాళ్లు కన్నీళ్లు దిగమింగి బ్రతకానంటూ బోరుమంది. గ్రామస్థులు ఆమెకు సర్ధి చెప్పి..కట్లు విప్పడంతో వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు ఆ తాగుబోతు భర్త. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో జరిగింది. తన్నులు తిన్నది గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి కాగా..అపరకాళిగా మారి చితకబాదిన అతడి ఆళి పేరు కనకవ్వ. భార్యలపై ప్రతాపం చూపే వీర మగాళ్లు..ఈ విషయం కాస్త మనసున పెట్టుకోని మొదలండి. ఆళికి సహనం లోపిస్తే..సీన్ రివర్స్ అవుతుంది.
123 Total Views, 6 Views Today