AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మొక్క జొన్న రైతులను ఆదుకోవాలి

1 min read


AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

ఈ రోజు రాష్ట్రం లో కె.సి.ఆర్ ప్రభుత్వం కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చకుండా ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారు ప్రజల ప్రాణాలు రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంతేకాకుండా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా పండించిన పంటలకు మార్కెట్ను కూడా కల్పించకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము దీన్ని భావిస్తున్నాం
అంతేకాకుండా అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోగా పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు ఈనాడు ఈ రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కారణం గత సంవత్సర కాలంలో మొక్కజొన్న పండించిన రైతులకు ప్రభుత్వమే కొనుగోలు చేసి కిoట్టనికి 1700 రూపాయలను దాదాపుగా కట్టించింది కానీ ఈసారి మాత్రం మొక్కజొన్న రైతులను ప్రభుత్వం పూర్తిగా మోసం చేసి మొక్క జొన్న పండించిన పంటలను కొనుగోలు చేయకపోగా వీటికి మార్కెటింగ్ లేకుండా చేసింది మొక్కజొన్న రైతులు దిక్కు తోచని పరిస్థితిలో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించిన క్రమంలో ప్రైవేటు వ్యాపారస్తులు కిoట్టనికి 1300 లేదా 1200 తక్కువ ధరకే కొనుగోలు చేసి సకాలంలో రైతులకు డబ్బులు ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రభుత్వం వీళ్ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రభుత్వానికి రైతుల పైన ఎలాంటి ప్రేమ ఉన్నా కానీ రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జన సమితి పార్టీ మొక్కజొన్న రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాము
అంతేకాకుండా దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చాలా ఇబ్బందులు పడుతూ వారు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంత ప్రాధేయపడినా కూడా సరైనటువంటి దాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయలేక ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు కుమ్మక్కయి రైతులను మోసం చేస్తున్నారు రైతుల వద్ద నుండి హమాలీలకు కూలీలు మరియు ఇతరత్రా కమిషన్లను వసూలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు అంతేకాకుండా ఒక్క కిoట్టనికి దాదాపుగా 2600వందలు దాకా మోసం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చేస్తున విధానం పూర్తిగా దౌర్భాగ్యమైన పరిస్థితిగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా ఇటువంటి పనికిమాలిన చర్యలు మానుకోవాలని సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి వారికి సకాలంలో డబ్బులు చేతికి అందేలా చూడాలని తెలంగాణ జన సమితి పార్టీ డిమాండ్ చేస్తుంది…

 1,324 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.