AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మోదిచిత్రపటానికి పూలాభిషేకం…

1 min read

AAB NEWS : కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశీయ వాక్సిన్ను పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారందరికీ ఉచితంగా అందిస్తామని మోది సర్కార్ ప్రకటనతో దేశవ్యాప్తంగా మోదీ ఫ్లేక్సీలకు, చిత్రపటాలకు పూలాభిషేకాలు మరియు పాలాభిషేకాలు పెద్ద ఎత్తున ఆయన మోది అభిమానులు బిజెపి కార్యకర్తలు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలాజీ నగర్ 115 డివిజన్ బిజెపి అధ్యక్షుడు శ్రీ జి.వినోద్ కుమార్ గౌడ్ గారు మోదీ చిత్రపటానికి పూలాభిషేకంతో పాటు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్(అర్బన్)జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ పన్నాల హరీష్ చంద్రారెడ్డి గారు మరియు విశేష అతిధిలుగా తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు శ్రీ వి.యస్.శ్రీనివాస్ గౌడ్ గారు మరియు మేడ్చల్(అర్బన్) జిల్లా బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షులు శ్రీ మంగేష్ గారు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా పన్నాల హరీష్ చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ గత సోమవారం జాతినుద్దేశించిన ప్రసంగించిన భారతప్రధాని నరేంద్ర మోదీ గారు దేశప్రజలందరికీ వరాలజల్లులు కురిపించారని..పద్దెనిమిది సంవత్సరాలు నిండిని భారతపౌలందరికీ జూన్ ఇరవైఒకటి నుండి ఉచితంగా కోవిడ్ టీకాలు అందిస్తామని అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని..ప్రవేటు ఆసుపత్రులకు ఇరవైదు శాతం టీకాలు అందిస్తామని..అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పధకం నవంబర్ వరకు పొడిగిస్తు ఎనభైకోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజసంక్షేమం కోసం కట్టుబడి ఉందని, మోది ప్రభుత్వం కరోనాతో, శత్రుదేశాలతో యుద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు మోదితో యుద్ధం చేస్తున్నారని.. టీకాల విషయంలో ప్రతిపక్షాల పుకార్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ప్రజలంతా మోదికి అండగా ఉన్నారని.. డిసెంబర్ నాటికి ప్రతి భారతీయుడికి టీకా ఖచ్చితంగా అందుతుందని కరోనా జయించడంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు వినోద్, బాల నారాయణ‌, అర్జున్, సంతోష్, నవీన్, రాములు, జగదీశ్ మహిళా బిజెపి నేతలు స్వరూప, జ్యోతి, బిజెపి కార్యకర్తలు, మోది అభిమానులు పాల్గొన్నారు.

 241 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.