AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మోదీ పథకానికి జై కొట్టిన కేసీఆర్..

1 min read

AABNEWS : తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ కంటే రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకమే అద్భుతంగా ఉందని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు, మోదీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్నీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని జోడించడానికి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ప్రధాని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయుష్మాన్ భారత్ , ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించింది. తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని భారత ప్రభుత్వం గుర్తించింది.’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకం అద్భుతంగా ఉందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని పలు వేదికల మీద ప్రకటించారు. అయితే, ఇప్పుడు సడన్‌గా కేంద్రం చట్టానికి మద్దతుగా నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 37 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.