AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

యడవల్లి రైతుల భూములు పరిరక్షిస్తా అన్న జగన్…

1 min read

AAB NEWS : యడవల్లి ఎస్సీ ల భూములు పరిరక్షిస్తా అని నాడు మాట ఇచ్చిన జగన్ నేడు మడమతిప్పడం,అవే భూములు లాక్కుని నాలుగు లక్షల రూపాయల ఎకరాకు ఇస్తామనడం దారుణంగా ఉందని ఎస్సి ఎస్టీల భూములను బలవంతంగా లాక్కోవడం జగన్ వల్ల కాదని రైతులకు అండగా నవతరం పార్టీ ఉంటుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.నవతరం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 09.06.2021 బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయం లో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం లో లక్ష్మీ అపర్ణ అనే మహిళ అపోలో ఉద్యోగిని పై దాడి చేసిన పోలీసులు చర్య,విశాఖలో మానసిక వికలాంగుల పాఠశాల కూల్చివేత సంఘటన జగన్ పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయని తెలిపారు.వెంటనే విశాఖలో ఘటనలకు కారణమైన అధికారులను సస్పెండ్ చేసి జగన్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కరోనా బాధితులు కోసం మందు తయారు చేసిన అనందయ్య బొమ్మ కాకుండా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బొమ్మలు మందు డబ్బాలు పై వేసుకుని వైసీపీ నేతలు మందు పంపిణీ చేయడం ప్రచార ఆర్భాటాలు వల్ల ఉపయోగం లేదని అనందయ్య మందు ఆయన ద్వారా క్యాంపులు ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని నవతరం పార్టీ డిమాండ్ చేస్తోందని విమర్శించారు.చిలకలూరిపేట చెంచులు భూముల కొనుగోలుకు బడ్జెట్ విడుదల చేసిన తరువాత కూడా మీనమేషాలు లెక్కించడం చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పై చర్యలు తీసుకోవాలని నిధులు విడుదల చేసి భూములు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.

 279 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.