September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

యువతకు మార్గదర్శకం చూపుతున్న సింగరేణి

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

భూపాలపల్లి ఏరియాలోని స్థానిక మరియు పరిసర గ్రామాల యువకులు 50 మందికి సింగరేణి సేవా సమితి ద్వారా డా.బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఉచిత ఆర్మీ శిక్షణ ఇవ్వడం జరిగింది. హైదరబాద్ లో నిర్వహించిన ఇండియన్ ఆర్మీ సెలెక్షన్స్ కి తేదీ 05.03.2021 నుండి 24.03.2021 వరకు హాజరైనారు.వీరిలో 8 మందికి ఫిజికల్ మరియు మెడికల్ టెస్ట్ లో పాసైనారు. తదుపరి వీరికి వ్రాత పరీక్ష ఉంటుంది. వీరికి వ్రాత పరీక్ష కొరకు 8 ఇంక్లైన్ కాలనీ, రామగుండం ఏరియా – 2లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఉచిత శిక్షణలో భాగంగా వారికి ఉచిత వసతి మరియు భోజన సౌకర్యమ సింగరేణి యజమాన్యం ద్వారా కల్పించడం జరుగుతుందని
ఏరియా అధికార ప్రతినిధి ఏస్.అనిల్ కుమార్ ,పర్సనల్ మేనేజర్ తెలిపారు. వీరినిఏరియా జనరల్ మేనేజర్ ఈ.సిహెచ్. నిరీక్షన్ రాజ్ అభినందించారని తెలిపారు.
వీరికి వ్రాత పరీక్ష కొరకు హైదరబాద్ శిక్షకులచే (ఫ్యాకల్టీ) ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

 1,658 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.