November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

యోగి పాలనలో ఉత్తరప్రదేశ్ లో ఏమి జరుగుతుంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా…

1 min read

AABNEWS : స్థానిక మన్సూర్ నగర్ లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయంలో అన్ని ప్రజా సంఘాల తో ప్రస్తుతం మైనారిటీ లు మరియు దళితులపై జరుగుతున్న దాడులు ,దౌర్జన్యాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆధిత్యనాధ్ జంగిల్ రాజ్ గురించి గెట్-టూగెదర్ నిర్వహించారు.విలేఖరుల సమావేశంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ పోలీసులు గూండాలు మారి ఇప్పటివరకు మైనారిటీ ల పై మరియు దళితులపై దాడులు చేయడం హింసాత్మక ఘటనలకు నష్టపోయిన బాధితులపై కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు రైలు లో ప్రయాణిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను ఉత్తరప్రదేశ్ పోలీసులు చట్టవ్యతిరేకంగా కిడ్నాప్ చేయడం పోలీసు వ్యవస్ధ కే మచ్చ అని. న్యూ ఢిల్లీలో ,షాహిన్ బాగ్ లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంపై ఉత్తరప్రదేశ్ STF దాడులు మరియు వెదింపులు యోగి ప్రభుత్వం మొదలుపెట్టిన కుట్రలలో ఒక భాగమని.గత రెండు నెలల క్రితం అదే కార్యాలయలం పై ED దాడులు జరిగాయి కాని మా కార్యాలయంలో ఎటువంటి చట్టవ్యతిరేకమైన పనులకు సంబంధించి సాక్షాలు లంభించలేదని.ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ STF దాడులు కూడా కేవలం వేధించటానికి జరిగిన ఒక ప్రయత్నమని.ఉత్తరప్రదేశ్ STF చట్టాన్ని అనుసరించకుండా ,పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ను సెర్చ్ చేయటానికి ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా వచ్చి జండాలను ,ప్రింటెడ్ PR పత్రాలను మరియు హ్యాండ్ బిల్స్ ను స్వాధీనం చేసుకోవటం చట్టవిరుధ్ధం STF ఈ డాక్యుమెంట్లను నేరారోపణకు ఉపయోగించే కుట్రలు చేయవచ్చని తెలిపారు.గత కొన్ని మాసాల నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై విషాన్ని కక్కుతూ కుట్రలు చేస్తు ఈ సంస్థ కు ఉగ్రవాద కుట్రలలో సంబంధాలు ఉన్నాయని కల్పిత కధనాలు అల్లి అన్యాయంగా ఉత్తరప్రదేశ్ లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను అరెస్ట్ చేయటం జరిగిందని. CAA కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో ఉత్తరప్రదేశ్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అడ్హక్ కమిటీ క్రియాశీల పాత్ర పోషించిందని ఈ అరెస్టులు మొదలైనాయి. పౌరసత్వ నిరసనలలోఉత్తరప్రదేశ్ పోలీసుల చే అన్యాయంగా పీడించడ్డ మరియు హత్య చేయబడ్డ అమాయక ప్రజలకు న్యాయం జరగాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా న్యాయ సహాయం అందించింది. రాష్ట్రంలో మైనారిటీ లపై జరిగిన పోలీసుల దౌర్జన్యాలపై పోలీసులపై న్యాయ విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర హైకోర్టు లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PIL ప్రజా ప్రయోజన వాజ్యమును వేయడం జరిగింది. ఈ న్యాయ పోరాటం పై ప్రతికారముతో రాజ్యాంగ వ్యతిరేకంగా అన్యాయంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ అడ్హక్ కమిటీ మెంబర్ లను అరెస్టులు చేయడం వారి కుటుంబ సభ్యులు ను వేధించటం జరిగింది. చివరికి హధ్రాస్ రేప్ కేస్ పై విషయాలను తెలుసుకోవడానికి వెళ్ళిన పత్రిక విలేఖరిని మరియు విద్యార్థి ఉద్యమకారులను పాపులర్ ఫ్రంట్ తో సంభంధాలు ఉన్నాయని కల్పిత కుల హింసను చూపించి ఆ రేప్ కేసులో దోషులను పట్టుకోవటంలో పోలీసుల విఫలమును కప్పి పుచ్ఛటానికి అరెస్టు చేయడం జరిగింది. ట్రైన్ లో తమ ఇంటికి వెళ్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలైన అన్షద్ మరియు ఫిరోజ్ ఖాన్ ను ఈ పోలీసు కుట్రలలో భాగంగా ఇద్దరిని అపహరించి మరియు చట్టవ్యతిరేకంగా నిర్బంధించటం విషపూరిత కుట్రలలో ఒక సరికొత్త విధానం కేరళలో దీనిని ఖండిస్తూ యోగి ఆధిత్యనాధ్ కు వ్యతిరేకంగా ధర్నాలు జరిగినాయి.ఈ ధర్నాలను ఆపించటానికి సకల ప్రయత్నాలు జరిగిన కేరళ అంతట యోగి కు వ్యతిరేకంగా ధర్నాలు విజయవంతంగా జరిగినాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా మరియు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పై జరుగుతున్న ఈ కుట్రలు కుతంత్రాలకు పాపులర్ ఫ్రంట్ ఎన్నటికీ భయపడదని .భారతీయులమైన మేము నేడు అధికారంలో ఉన్న బ్రిటిష్ ఏజెంట్ లు మరియు ఫ్యాసిస్ట్ శక్తులకు భయపడమని వీరి యజమానులైన బ్రిటిష్ వారినే తరిమికొట్టిన మేము మరోసారి వారి ఏజెంట్లను తరిమికొట్టడానికి భారతీయులందరు ఏకం కావాలని తెలిపారు. నేడు దేశంలో అన్ని ప్రజా సంఘాలు ఏకమై జరుగుతున్న దారుణాల నుంచి దేశాన్ని మరియు ప్రజలను రక్షణ కల్పించాలని కోరారు

 423 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.