AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో ఘర్షణ…

1 min read

AAB NEWS:వైసీపీ, బీజేపీ వర్గీయుల మధ్య జరిగిన దాడులతో కడప జిల్లా ఉలిక్కి పడింది. రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు కత్తులతో దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో బీజేపీకి చెందినవారు ఆరుగురు, వైసీపీకి చెందినవారు ముగ్గురు గాయపడ్డారు. బీజేపీకి చెందిన వారి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేశ్ కూడా గాయపడ్డాడు.వివరాల్లోకి వెళ్తే… ఇటీవలే అయ్యవారిపల్లిలో 100 కుటుంబాలు వైసీపీ నుంచి బీజేపీలోకి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు ప్రసాద్, గ్రామ వాలంటీర్ వెంకటేశ్ మధ్య సంక్షేమ పథకం విషయంలో గొడవ జరిగింది. దీంతో, బీజేపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ ను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 146 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.