September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్‌ సర్జరీ

1 min read

AABNEWS : రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్‌ సర్జరీ న్యూఢిల్లీ: ఛాతీలో నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం తాజాగా మంగళవారం ఆయనకు బైపాస్‌ సర్జరీ విజయవంతంగా వైద్యులు చేశారు. ఈ విషయాన్ని ఎయిమ్స్‌ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటగా ఉందని.. కోలుకుంటున్నారని వెల్లడించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ వైద్యులను ఆయన అభినందించారు. ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఛాతీ నొప్పితో సైనిక (ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌) ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షలు రావడంతో రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కు బైపాస్‌ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్‌ సర్జరీ విజయవంతంగా ముగించారు.

 1,017 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.