AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీని ప్రారంభించిన జంగా రాఘవరెడ్డి

1 min read

AABNEWS వరంగల్ ప్రతినిధి గైని ప్రవీణ్ కుమార్

కాజీపేట్ రైల్వే స్టేడియం నందు రాష్ట్ర సాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి క్రికెట్ పోటీలను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 50 క్రికెట్ టీములు పాల్గొంటున్న ఈ క్రీడా పోటీల్లో, పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా, తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్న జై భీమ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులకు, సహకరిస్తున్న కాజీపేట లైన్స్ క్లబ్ వారికి, దాతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇలాంటి పోటీలు క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభ నైపుణ్యతను వెలికితీసేందుకు దోహదపడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో 33 వ డివిజన్ కార్పొరేటర్ తోట్ల రాజు యాదవ్, కార్పొరేటర్లు జక్కుల రామా రవీందర్ యాదవ్, మౌనిక చరణ్ రెడ్డి , కాంగ్రెస్ నేతలు గుర్రపు కోటేశ్వర్, సందేల విజయ్ కుమార్, పసునూరి మనోహర్, వసుకుల శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

 250 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.