రెడ్డికి పీసీసీ పగ్గాలు…
1 min readaabnews : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి అనే పేరు హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయనకే పీసీసీ అధ్యక్ష పదవి ఖరారయిందనే వార్తలు అటు కాంగ్రెస్ లోనూ, ఇటు తెలంగాణ రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి పార్టీ పగ్గాలు ఇచ్చినా పర్లేదన్నది కాంగ్రెస్ లో పీసీసీ పదవిని ఆశిస్తున్న మెజార్టీ నేతల డిమాండ్. రేవంత్ కు పగ్గాలిస్తే కాంగ్రెస్ భూ స్థాపితం ఖాయమని వీహెచ్ లాంటి కురువృద్ధులు కూడా ఆవేదన చెందుతున్నారు. ‘నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఎలా ఇస్తారు? ఎన్నో ఏళ్లుగా మేం కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్నాం. కోమటిరెడ్డికి ఎందుకు ఇవ్వరు.? జగ్గారెడ్డికి ఎందుకు ఇవ్వరు.? శ్రీధర్ బాబుకి ఎందుకు ఇవ్వరు.? ఈ నకిలీ రెడ్డి అయిన రేవంత్ కు పగ్గాలు ఎలా ఇస్తారు.? ఈయన చంద్రబాబు మనిషి అని కేసీఆర్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు ఎవరైనా ఓట్లేస్తారా?’ అని ప్రెస్ మీట్ పెట్టి మరీ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి.. ఇలా రేవంత్ తో పాటు పీసీపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య కాంగ్రెస్ లో చాంతాడంత ఉంది. మరి వాళ్లందరినీ కాదని రేవంత్ కు పార్టీ పగ్గాలను అప్పగిస్తే కాంగ్రెస్ కు ప్లస్సా..? మైనస్సా..? కాంగ్రెస్ కు పునర్వైభవం లభిస్తుందా..? అన్న దానిపై ప్రత్యేక కథనం. కాంగ్రెస్ లో అలాంటి లీడర్ ఎవరు..? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఇవీ తెలంగాణలో ప్రధాన పార్టీలు. గులాబీ దళపతి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు టీఆర్ఎస్ కు స్టార్ క్యాంపెయినర్లు. ఇటు బీజేపీకి బండి సంజయ్ స్టార్ క్యాంపెయినర్. దూకుడు తత్వం, పదునైన ప్రసంగాలు చేయగలగడం, ప్రత్యర్థులను ఇరుకున పెట్టగలిగేలా మాటల దాడులు చేయడం వీరికి ఉన్న ప్రధాన బలం. మరి కాంగ్రెస్ లో అలాంటి వాళ్లు ఎవరు ఉన్నారు.? అని చూస్తే ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తారు. కేసీఆర్, టీఆర్ఎస్ పై కయ్యానికి కాలు దువ్వడంలో రేవంత్ ముందుంటారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కొడంగల్ లో ఎంత రచ్చ జరిగిందో.? రేవంత్ ను ఎలా టార్గెట్ చేశారో.. అందరికీ తెలిసిందే. రేవంత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదన్న ప్రధాన లక్ష్యంతోనే అక్కడ టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. మొత్తానికి ఆ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. అంటే రేవంత్ తన ప్రత్యర్థిగా టీఆర్ఎస్ చెప్పకనే చెప్పింది. అలాంటి రేవంత్ కాంగ్రెస్ కు పీసీసీ అధ్యక్షుడు అయితే ప్లస్తే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పూర్తి ఆధారాలతో, పక్కా సమాచారంతో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో గత అసెంబ్లీలో రేవంత్ సక్సెస్ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి కనుక వస్తే రేవంత్ కూడా దూకుడును మరింత పెంచాలని యోచిస్తున్నారు. తెలంగాణ అంతటా పాదయాత్ర చేస్తానని కూడా రేవంత్ ప్రకటించారు. అదే జరిగితే తెలంగాణలో పునర్వైభవం కచ్చితంగా వస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశిస్తున్నారు. ‘అటు దుబ్బాకలోనూ, ఇటు జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయాలు జరిగాయి. మీడియా కూడా వారి మధ్యే ప్రధాన పోటీ అన్నట్టుగా సీన్ ను క్రియేట్ చేశాయి
226 Total Views, 2 Views Today