రెవెంత్ రెడ్డి కి పగ్గాలు
1 min read
AAB NEWS ప్రతినిధి dr. సామల శశిధర్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు అటు ఢిల్లీలోనూ.. ఇటు హైదరాబాద్‌లోనూ వినపడుతోంది. పదే పదే ఢిల్లీ వెళ్లిన కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డిని తాజాగా పిలిపించుకుని అదే విషయం చెప్పినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్ష పదవికోసం తీవ్రంగా పోటీపడిన కోమటిరెడ్డికి సీడబ్ల్యూసీ మెంబర్ షిప్ ఇస్తున్నట్లు తెలియవచ్చింది. అలాగే ఆయనకు మరికొన్ని పనులు కూడా ఫేవర్ చేస్తారని చెబుతున్నారు. ఆ విధంగా ఆయనకు నచ్చజెప్పారని.. ఇక అధికారికంగా రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్‌ను పీసీసీగా తీసుకోవద్దంటూ లేఖలు రాసినవారిని, సీనియర్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం నచ్చజెప్పినట్లు సమాచారం.
మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రాహుల్ గాంధీ కూడా రేవంత్ పేరును ఖరారు చేసినట్లు తెలియవచ్చింది.
రేవంత్ రెడ్డి రాక కాంగ్రెస్‌కు బలమే. అందులో సందేహం లేదు. దూకుడుగా ఉండడం.. ఆర్థికంగా ఉన్న వ్యక్తి. అయితే కాంగ్రెస్‌లో రేవంత్ జూనియరే.. అందుకే సీనియర్లు అలిగే అవకాశం కూడా ఉంది. మరి ఆ సీనియర్లు, ఇతరులను కలుపుకుపోయే తత్వం రేవంత్ దగ్గర ఉందా? అనేదే ఇప్పుడు అనుమానం. సాధారణంగా వన్‌సైడ్‌గా దూసుకుపోయే రేవంత్ రెడ్డి స్పీడ్‌కు.. స్లో మోషన్ సీనియర్లు తట్టుకోవడం కష్టమే.. అప్పుడేమైనా నష్టం జరుగుతుందా? అనే భయం కూడా ఉంది.
120 Total Views, 2 Views Today