రైతు ఆత్మహత్య…
1 min read
AABNEWS : కుటుంబ, ఆర్థిక సమస్యలు తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రైల్వేకోడూరు మండల పరిధిలోని బుడుగుంటపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడుగుంటపల్లెకు చెందిన పులగూర రామచంద్రయ్య (52) వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. ఇటీవల వ్యవసాయంలో నష్టాలు రావడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వాటిని తాళలేక బుధవారం పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నట్లు ఎస్సై పెద్దఓబన్న పేర్కొన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
82 Total Views, 2 Views Today