AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన జేడీ…

1 min read

AAB NEWS:చిట్టమూరు మండలంలోని అరవ పాలెం మరియు వాకాడులోని 1 వ రైతు భరోసా కేంద్రాలను నెల్లూరు జిల్లా వ్యవసాయశాఖ జేడీ శివనారాయణ గురువారం తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వాకాడులోని సర్వారెడ్డి గోపాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోపాల్ రెడ్డి రెండు రకాల వరి సాగు వేయడం జరిగిందన్నారు. సాగుకు అవసరమైన పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వరి సాగు 16 ఎకరముల వేయడం జరిగిందని, అలాగే 6 ఎకరాలలో సేంద్రియ పద్ధతులలో M7 రకం సాగు చేస్తున్నారన్నారు. వీటికి తెగుళ్ళు తక్కువగా ఉండడమే కాకుండా, మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. ఆయన వెంట వ్యవసాయ శాఖాధికారిణి సి.హెచ్ విజయభారతి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లక్ష్మయ్య , రైతు భరోసా కమిటీ సభ్యులు సర్వారెడ్డి గోపాల్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.

 106 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.