AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతు వేదిక ప్రారంభం …

1 min read

AABNEWS : నిర్మల్ మండలం చిట్యాలలో రైతు వేదికను ప్రారంభించిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం, రైతు బంధు దేశానికి ఆదర్శం రైతులను సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం రైతులందరూ ఒక్కచోట చేరి తమ సాదకబాధకాలను చర్చించుకొనే రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తోందన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత సాగు నీటి వసతి, 24 గం టల విద్యుత్‌, రైతు బందు, రైతు బీమాను ప్రవేశపెట్టి రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుంది. జిల్లాలో 79 రైతు వేదికల నిర్మాణం చేస్తున్నాం. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి స్వర్ణ వాగుపై 11 చెక్ డ్యాం లు నిర్మిస్తున్నాం చిట్యాల వాగుపై రూ.3 కోట్లతో చెక్ డ్యాం నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిపధంలో ముందుకుపోతున్నాము.తెలంగాణలో జీవ వైవిధ్యం కూడా – పునర్జీవం పోసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేకానేక చర్యల వల్ల అంతరించిపోతున్న పశుపక్ష్యాదులు మళ్లీ కనపడుతున్నాయి.

రైతు ఆత్మహత్యలు లేవు. దుఃఖం నుంచి దూరం అయ్యాము. 60 ఎండ్ల కష్టాల నుంచి ఆరెండ్ల కాలంలోనే బయటపడగలిగాము. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో సాగునీటి కష్టాల నుంచి బయటపడ్డాము
1 కోటికి పైగా ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాం.

సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగైంది.

మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యసాయిక చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నారు. వీటిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు.

పగలనక రాత్రనక కష్టపడుతున్న రైతుల నడ్డి విరిచేల నూతన వ్యవసాయ చట్టాలు ఉన్నాయి.

రైతులకు వారి వ్యవసాయ ఉత్పత్తుల మీద నియంత్రణ ఉండదు. రైతులు వ్యాపారులపై ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారా? ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక్కటైన బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా?

బీజేపీ నాయకులకు సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు లేదు.

రాష్ట్రాలను బెదిరిస్తూ రాజకీయ దాడులు చేస్తున్నారు.

ఇది ప్రజాస్వామ్యమా, దాదాగిరినా?

కేంద్రం ఒక పార్టీ జాగీరా ?

రాష్ట్రాల నుంచి పన్నులను వసూలు చేస్తూ… అదే నిధులను రాష్ట్రాలకు ఇస్తుంది తప్ప వాళ్ళ జెబుల నుంచి ఇస్తున్నారా?

బాగుపడుతున్న తెలంగాణలోని బీజేపీని రానిస్తే.. భవిష్యత్తు అంధకారం అవుతుంది.

 288 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.