AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లింగాపూర్ లో బి.ఆర్‌. అంబేడ్కర్ 64 వ వర్ధంతి వేడుకలు…

1 min read


AAB NEWS : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి పురస్కరించుకొని స్థానిక లింగాపూర్ ఎస్సీ కాలనీలో కాంపల్లి ప్రదీప్, ఇరికిల్ల అవినాష్ మరియు యువత ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ ఇరికిల్ల శంకరయ్య , నిమ్మరాజు రవి పాల్గొన్నారు,అతిధులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈరోజు ఈ సమాజంలో ఇంత స్వేచ్ఛ గా బ్రతుకగలుగుతున్నామని కులాల మధ్య అంటరానితనం పై ఆయన చేసినా పోరాటం అంతా ఇంతా కాదని నేటి సమాజంలో బడుగు బలహీన వర్గాలకు ఈ మాత్రం విలువలు ఉన్నాయంటే కేవలం అది ఆ మహనుభావుడి వల్లనేనని, తాను చదువుకున్న పాఠశాల లో అగ్రకులాల విద్యార్థులచే అంటరాని వాడని మూతికి ముంత ను నడుముకు తాటి ఆకులు కట్టి ఛీత్కరించి అవమాన పరిచిన స్థాయి నుండి ప్రపంచమే తనను మార్గదర్శిగా తీసుకునే స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ యువత ముందుకు నడవాలి అని గ్రామంలో రాబోయే రోజుల్లో ఆయన విగ్రహ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మాట్లాడారు.సుందిళ్ళ శశివంశీ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో గాలి శ్రీనివాస్, ఇరికిల్ల రాజయ్య,కాంపెల్లి చంద్రయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, వెల్గటూరి కొమురయ్య,ఇరికిల్ల రాజనర్స్,ఇరికిల్ల మధు,ఇరికిల్ల ఓంకార్, ఇరికిల్ల సాయి,ఇరికిల్ల కళ్యాణ్, వినయ్,సుందిళ్ళ మధు,అధిక సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు.

 74 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.