AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వయసు తేడా ఉండటంతో ప్రాణాలు తీసుకున్న జంట…

1 min read

AABNEWS :  భార్యాభర్తల్లో భర్త ఏజ్‌ కామన్‌గా పెద్దగా ఉంటుంది. అమ్మాయికన్నా అబ్బాయి వయసు పెద్దగా చూసుకొనే పెళ్లిళ్లు చేస్తుంటారు. సెంటిమెంట్‌ పరంగా ఎన్ని కారణాలు చెప్పినా అదే అనాదిగా కొనసాగుతూ వస్తోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మాయి ఒకట్రెండు సంవత్సరాలు పెద్ద అయి ఉంటుంది. కానీ.. అమ్మాయి వయసు 21 ఉండి.. అబ్బాయి వయసు 15 ఏళ్లు మాత్రం ఉంటే..? సరిగ్గా ఇక్కడ ఓ ప్రేమజంట ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది. తమ ప్రేమకు వయసు అడ్డంకి అనుకొని భ్రమపడి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది ఈ ఘోరం. జిల్లాలోని గార్ల మండలానికి చెందిన ప్రశాంత్ పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఇద్దరికీ కొన్నాళ్ల కిందట పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వయసులో వ్యత్యాసం ఉండడంతో వీళ్లు తమ ప్రేమ విషయాన్ని మూడో వ్యక్తికి చెప్పలేదు. అలా అలా కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే.. ఇలాంటి విషయాలు కూడా ఎన్నో రోజులు దాగవు కదా. సోమవారం ఇరు కుటుంబాలకూ తెలిసింది. దీంతో ఈ ప్రేమ జంట అదే రోజు తమ ఇళ్ల నుంచి పారిపోయింది. వీరిద్దరి కోసం వెతుకుతున్న క్రమంలో ఊరు శివార్లలోని వ్యవసాయ బావిలో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. వయసు తేడా వల్ల తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమో అనే భయంతోనే వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని, పోలీసులు అనుమానిస్తున్నారు.

 58 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.