ఖబడ్దార్ బిజెపి నాయకుల్లారా…
1 min read
AABNEWS : వరంగల్ రూరల్ జిల్లా దామర మండల కేంద్రంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి ఇంటి పైన బీజేపీ నాయకుల దాడిని ఖండిస్తూ, గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజు ఆధ్వర్యంలో బిజెపి నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించే ప్రజానేత ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు అని, అలాంటి మచ్చలేని నాయకుని ఇంటిపై దాడులు చేయడం తగదని, మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే ప్రతి దాడులకు మేము సిద్ధమని, మాది ఉద్యమ పార్టీ అని గుర్తు చేసుకోవాలని, బిజెపి నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్ జెడ్పిటిసి గరిగే కల్పనా కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ మండల పార్టీ అధ్యక్షుడు కమలాకర్, ఎంపీటీసీ కృపాకర్ రెడ్డి, మండలనాయకులు దామెరుపుల శంకర్, పున్న సంపత్ సంతోష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు
340 Total Views, 6 Views Today