గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా…
1 min read
AABNEWS : వరంగల్ రూరల్ :ఈరోజు దామెర మండలకేంద్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దామెర ముద్దుబిడ్డ గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గారు నియోజకవర్గ స్థాయి నాయకులతో,కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరగబోయే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తనను గెలిపిస్తే ఉద్యోగ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో తన గళం వినిపించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతానని, అందుకు నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల ఇంచార్జ్ పెసరు విజయ్ చందర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురు ప్రసాద్,జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొండి జితేందర్ రెడ్డి,ఆర్ పి జయంతి లాల్,జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీ రామ్ రెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గంగిడి బుచ్చిరెడ్డి, మండల అధ్యక్షుడు జంగిలి నాగరాజు,ప్రధాన కార్యదర్శి సతీష్,రాజ్ కుమార్,PACS డైరెక్టర్ మాదారపు రతన్ కుమార్,బీజేవైఎం అధ్యక్షుడు ముత్యాల సృజన్,కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్,ఉపాధ్యక్షులు అర్థం రాజు,జగన్ ,కార్యదర్శి మెరుగు సంపత్ , కిరణ్ , మండల నాయకులు,బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు,పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
381 Total Views, 4 Views Today