అధికారులు కార్పొరేటర్లు తో ఎమ్మెల్యే ఆరూరి సమీక్షా…
1 min read
AABNEWS : మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే ఆరూరి సమీక్షా సమావేశం..వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ డివిజన్లలో చేపట్టిన పనులు, వాటి పురోగతి, పనుల పెండింగ్ కు గల కారణాలు వంటి అంశాల పై మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండా ప్రకాష్ గారు, కమిషనర్ పమేలా సత్పతి గారితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు డివిజన్లలో మొదలుపెట్టిన పనులను పూర్తిచేయాలని,ఇంకా మొదలుకాని పనులను వెంటనె మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరారు.అదేవిధంగా పూర్తి అయిన పనులకు వెంటనె బిల్లులు మంజూరు చేయాలని,పెండింగ్ లేకుండా బిల్లులు మంజూరు చేయాలని పలు శాఖల అధికారులను సూచించారు.అదేవిధంగా ఎవరి డివిజన్లలో వారు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చేయవలసిన బాధ్యత కార్పొరేటర్లదీ అని,ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషిచేయాలని స్థానిక కార్పొరేటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,కాంట్రాక్టర్లు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు…

492 Total Views, 2 Views Today