అమృత్ పథకంలోఅసంపూర్తి…
1 min read
AABNEWS : అమృత్ పథకంలోఅసంపూర్తిగా పనులను వేగవంతం గా పూర్తి చేయండి: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి తో కలసి అధికారులతో సమీక్ష.. అసంపూర్తిగా పనులను వేగవంతం గా పూర్తి చేసి ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు అందించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఆయన గ్రెటర్ కమిషనర్ పమేలా సత్పతి తో కలసి బల్దియా, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో సమన్వయ సమావేశం జరిపి త్రినగరిలో అమృత్ పథక పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ మహానగరంలో ఫిబ్రవరి నెల నుంచి ప్రతి రోజూ, ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీటిని అందించుటకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రూ 554.18 కోట్లతో 1698 కిలోమీటర్లు పైప్లైన్ లకు గాను 1355 పైప్లైన్ పనులు పుర్తయినాయని, ఇంకను మిగిలియున్న 342 కిలోమీటర్లలో 13.5 కిలోమీటర్లు జనవరి 10వ తేదీలోగా , ఆన్ సర్వేడ్ ప్రాంతంలోని 329 కిలోమీటర్ల మేర పైప్లైన్ పనులు వచ్చే మే వరకు పూర్తి చేస్తామని అధికారులు వివరించగా, అధికంగా మాన్ పవర్ పెంచుకొని సమస్యలేవున్నా వాటిని అధిగమించి ఇంకను అసంపూర్తిగా ఉన్న పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఫిల్టర్ బెడ్ల ఆధునీకరణ పనులు త్వరితగతిన జరిగేలా నిత్యం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో బల్దియా, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ లు విద్యాసాగర్, శ్రీనివాస్ రావు, ఈఈ రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
16 Total Views, 2 Views Today