AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నర్సంపేట వ్యాప్తంగా కరోనా నిర్దారణ కోసం RAT…

1 min read

AABNEWS : నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కరోనా నిర్దారణ కోసం RAT (రాపిడ్ యాంటీజేన్ టెస్ట్) సేవలు 104 సర్వీస్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.. కరోనా రెండో దశ ప్రబలుతున్న సమయంలో దానిని కట్టడి చేయడంలో భాగంగా ఈ మొబైల్ వాహన సేవలు ఉపయుక్తంగా మారాయి. ఈ సేవలను నేడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయంలో వినియోగించుకొని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు.. ఫలితం నెగిటివ్ గా తేలింది.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..104 సర్వీస్ ద్వారా ఈ RAT సేవలు నర్సంపేటకు అందుబాటులోకి రావడం హర్షణీయం. కోవిడ్ పరీక్షల కోసం బాధితులు ఆసుపత్రుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా 104కి సమాచారం ఇస్తే సిబ్బంది వెంటనే స్పందించి, మీరు ఉన్న చోటకే వచ్చి కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేస్తారు.నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కరోనా కట్టడిలో భాగంగా లక్షణాలు ఉన్న అనుమానితులు ఎవరైనా ఈ సేవలు ఉపయోగించుకోగలరు.కరోనా పై అలక్ష్యం తగదు. కోవిడ్ కట్టడి కోసం సామాజిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకొవాలని కోరుతున్నాను.

 75 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.