ప్రమాదాలకు మూలా కారణాలు ఇవే…
1 min read
AABNEWS : వరంగల్ నగరంలో కోతులు, వీధి కుక్కలు, పందుల సమస్యపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటితో వేగలేక పోతున్నామని నగర ప్రజలు వాపోతున్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గేదెలు, ఆవులు ఇతర జంతువులు సంచరిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యతోపాటు రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం సీరియస్‌గా దృష్టి సారించింది. జంతు సరరక్షణ కేంద్రం ఏర్పాటైతే ఆయా జంతువులను పట్టుకునే బృందాన్ని రంగంలోకి దించుతారు. జంతు సంరక్షణ, పశువైద్య విభాగం ఏర్పాటుకు పురపాలక శాఖ సంచాలకుడు డాక్టర్ సత్యనారాయణ అనుమతి ఇచ్చారు. మామునూరులో దీన్ని ఏర్పాటుచేసేలా ఈనెల 30న బల్దియా కౌన్సిల్ ముందు ప్రతిపాదనలు పెట్టారు. ప్రస్తుతం చింతగట్టు ఎస్సారెస్పీ క్యాంపు దగ్గర కుక్కల శస్త్ర చికిత్స కేంద్రం కొనసాగుతున్నా సరైన వసతుల్లేకపోవడం ఇబ్బందిగా మారింది. కొవిడ్-19 లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి కోతులను పట్టుకోవడం లేదు. పట్టుకున్న వాటిని ఏటూరునాగారం అడవికి తరలిస్తున్నారు. పందులు తరలించేందుకు షెడ్లు ల్లేవు. ఈ అన్ని సమస్యలు అధిగమించేందుకు జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.ఇక్కడ ఆయా జంతువుల కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేయనున్నారు.
56 Total Views, 2 Views Today