AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వాట్సాప్‌కు పోటీగా సందేశ్‌లాంచ్ చేసిన కేంద్రం…

1 min read

AAB NEWS ; న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. సందేశ్‌గా నామకరణం చేసిన ఈ యాప్‌ గురించి కేంద్ర సహాయ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో వివరించారు. సందేశ్‌కు సంబంధించిన విశేషాలను లిఖిత పూర్వకంగా అందజేశారు. ‘సందేశ్ ఓపెన్ బేస్డ్ యాప్. ఇది చాలా సురక్షితమైనది. క్లౌడ్ ఎనేబుల్ అయిన ఈ యాప్‌కు సంబంధించిన కంట్రోల్‌ను ప్రభుత్వమే చూసుకుంటుంది. వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్‌ లాంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాప్ స్టోర్‌లో కూడా దీన్ని అందుబాటులో ఉంచుతున్నాం’ అని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.వాట్సాప్‌లా పని చేసే సందేశ్‌ను నేషనల్ ఇన్ఫోర్‌మెటిక్స్ సెంటర్‌ (ఎన్‌ఐసీ) డెవలప్ చేసింది. ఎన్‌ఐసీతోపాటు ప్రభుత్వ ఐటీ వింగ్ కలసి ఈ యాప్‌ను లాంచ్ చేశాయి. మొబైల్ నెంబర్‌తోపాటు ఈమెయిల్ ఐడీతోనూ కమ్యూనికేట్ చేసుకునేలా సందేశ్‌ను డిజైన్ చేశారు.

 65 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.