September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా…

1 min read

AABNEWS : నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు. శనివారంనాడు వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు వికారాబాద్ క్యాంప్ కార్యాలయం ఆవరణలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..భారత స్వాతంత్ర్య సంగ్రామానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు.
మీరు నాకు రక్తం ఇవ్వండి … నేను మీకు స్వాతంత్య్రం ఇస్తా”, ”జైహింద్‌”, ”ఢిల్లి చలో” అనే నినాదాలతో నేతాజీ ప్రజల్లో దేశభక్తి చిగురింపజేశారన్నారు.వలసవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తూ ఆంగ్లేయులపైకి దూసుకెళ్లిన బుల్లెట్‌ మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. నేతాజీకి యావత్ భారతావని ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు కమాల్ రెడ్డి, PACS చైర్మన్ ముత్యం రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ హఫీజ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, PACS వైస్ చైర్మన్ పాండు, రైతు బంధు అధ్యక్షులు వెంకటయ్య, సర్పంచుల సంగం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, జనరల్ సెక్రెటరీ సత్తయ్య గౌడ్, ex ఎంపీపీ నర్సింహ రెడ్డి, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, చందర్ నాయక్, కృష్ణ రెడ్డి, గోపాల్, సురేష్, పట్టణ కోశాధికారి లక్ష్మణ్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ జైనుద్దీన్, సర్పంచులు తిరుపతి రెడ్డి, నాయకులు రాం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బషీర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సాయి, శ్రీనివాస్,వేణు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 314 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.