September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పరశురామ్ రెడ్డి గారు మరియు పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం…

1 min read

AABNEWS : వికారాబాద్ జిల్లా, పరిగి మున్సిపల్
లో డీసీసీ అధ్యక్షుడు T.రామ్మోహన్ రెడ్డి గారి నివాసంలో పరిగి మండల పార్టీ అధ్యక్షులు పరశురామ్ రెడ్డి గారు మరియు పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి చిన్నారెడ్డి గారి తరపున పరిగి నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల సన్నాహక సమావేశం డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారి నివాస ప్రాంగణంలో నిర్వహించబడుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ mlc అభ్యర్తి చిన్నా రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి MP రేవంత్ రెడ్డి గారు, మరియు పొన్నం ప్రభాకర్ గారు, మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.కావున ఈ కార్యక్రమానికి పరిగి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పట్టభద్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షులు సుభాష్ చందర్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి అక్బర్ హుస్సేన్ గారు అదేవిధంగా రామచంద్రయ్య గారు, ఆనం ఆంజనేయులు, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, కౌన్సిలర్ శబ్బేనూర్ రియాజ్, మల్లేష్, మండల ST సెల్ అధ్యక్షులు టౌర్య నాయక్, నసీర్ భాయ్, అజస్, తదితరులు పాల్గొన్నారు.

 740 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.