బైంసా జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ కుల్కచర్ల మండల కేంద్రంలో నిరసన…
1 min read
AABNEWS : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో బైంసా జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ JATమరియు PNPSఆధ్వర్యంలో కుల్కచర్ల మండలం కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కు భాజపా రాష్ట్ర నాయకులు కరణం ప్రహ్లద రావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా కర్ణం ప్రహ్లదరావు జాట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి సమాచార వారధులుగా ఉన్న పాత్రికేయులపైనే దాడులు జరగడం ఆందోళనకరం. వేతనాలు కూడా సరిగాలేని బతుకులను వెళ్లదీస్తూ.. విధి నిర్వహణలో భాగమవుతున్న వారిపైనే హత్యాయత్నం చేయడం దారుణం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఈ ఆదివారం(07–03–21) రాత్రి చెలరేగిన అల్లర్లలో కవరేజీకి వెళ్లిన సాధారణ పాత్రికేయులపైనా విచక్షణ రహితంగా కత్తిపోట్లకు, రాళ్లదాడికి పాల్పడ్డారు. ఏ వర్గానికి సంబంధం లేకుండా తమ విధి నిర్వహణలో భాగంగా వివరాల సేకరణకు వెళ్లిన ముగ్గురిపై అల్లరిమూకలు దాడులు చేశాయి. ఇందులో భైంసాకు చెందిన రాజ్‌న్యూస్ రిపోర్టర్ విజయ్‌పై తీవ్రస్థాయిలో దాడి చేశారు. ఆయన బైక్‌ను తగులబెట్టారు. అనంతరం కత్తులతో నాలుగు చోట్ల పొడిచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉంది. ఆంధ్రజ్యోతి క్రైం రిపోర్టర్ ప్రభాకర్, లోకల్ చానల్ రిపోర్టర్ రవిని సైతం రాళ్లు, పంచ్‌లతో విచక్షణరహితంగా కొట్టారు. దీంతో వారు గాయాలపాలయ్యారు. ఈ ముగ్గురిపై దాడి చేయడమే కాకుండా వారి వాహనాలనూ తగులబెట్టడం దారుణం. ఇదే ఘటనలో మరికొంతమంది రిపోర్టర్లనూ టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులను జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(JAT) తీవ్రంగా ఖండిస్తోంది.
= విధుల్లో భాగంగా వెళ్లిన ముగ్గురు పాత్రికేయులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.
= సమాజానికి సమాచారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నవారిపై హత్యాయత్నం చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి.
= దాడుల్లో గాయాలు కావడంతో పాటు తమ వాహనాలనూ కోల్పోయిన ముగ్గురు పాత్రికేయులకూ రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలి.
= కత్తిపోట్లకు గురైన విజయ్‌కు ప్రభుత్వమే అన్ని ఖర్చులను భరించి, అత్యుత్తమ వైద్యాన్ని అందించాలి.
= ఇలాంటి ఘటనల్లో కవరేజీకి వెళ్లిన పాత్రికేయులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
= భైంసాలో ఘటన జరిగి మూడు రోజులైనా పాత్రికేయులకు ప్రత్యేక పాసులు ఇవ్వలేదు. వెంటనే వీటిని జారీ చేయించాలి. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మైపాల్ మాజీ సర్పంచ్ జానకిరామ్ జర్నలిస్టు రాఘవేంద్ర చారి నర్సింలు వినోద్ PNPSహరికృష్ణ సాయి కిరణ్ గౌడ్ గోపాలకృష్ణ రామచంద్రయ్య బచ్చయ్య మైపాల్ మల్లేష్ , గోపాల్ యాదవ్, మైముద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
699 Total Views, 10 Views Today