మాహాత్ముడికి శ్రద్ధాంజలి..
1 min read
AABNEWS : భారత జాతిపిత, దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహా నాయకుడు మహాత్మాగాంధీ గారి 72వ వర్ధంతి పురస్కరించుకుని విద్యాశాఖ మంత్రి శ్రీమతి. సబిత ఇంద్రా రెడ్డి గారు, వికారాబాద్ MLA డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మరియు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గార్లు వికారాబాద్ పట్టణం లోని గాంధీ పార్కు లో గల గాంధీజి విగ్రహనికి పులామాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమానికి, సమైక్యతకు, శాంతియుత జీవనం కోసం కృషి చేస్తూ ప్రాణాలర్పించిన మహానుభావులు గాంధీజీ గారు అని కొనియాడారు. సత్యం, అహింసా అనే రెండు సిద్ధాంతాలతోనే ఆయన దేశానికి స్వాతత్య్రం సాధించిపెట్టారని అన్నారు. అహింసా మార్గంలో కూడా యుద్ధం చేయొచ్చని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. శాంతి మార్గంలో స్వాతంత్య్రం సాధించిపెట్టిన ఆ నాయకుడి జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. భారత ప్రజలు ఆయనను నిత్యం స్మరించుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, ZP వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ శంషాద్ బేగం, AMC చైర్మన్ విజయ్ కుమార్,పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ హఫీజ్, కౌన్సిలర్లు, మాజీ ZPTC ముత్తహార్ షరీఫ్, DCMS చైర్మన్ కృష్ణా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
418 Total Views, 2 Views Today