విలేజ్ లెర్నింగ్ సర్కిల్ ….
1 min read
AABNEWS ; వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేట మండలం రేగడి మైలారం లో టీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విలేజ్ లెర్నింగ్ సర్కిల్ (వి ఎల్ సి) కేంద్రం వద్ద ఈరోజు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్రం నిర్వాహకురాలు, గురుకుల విద్యార్థిని జగ్జీవన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం వి ఎల్ సి విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు నిర్వహణ అందరూ అభినందించారు. Vlc గణతంత్ర వేడుకల నిర్వహణ బంట్వారం స్కూల్ పాఠశాల ఉపాధ్యాయురాలు వి ఎల్ సి పర్యవేక్షణ ఇంచార్జి నవిత పాల్గొని అభినందించారు. వి ఎల్ సి ల ప్రాముఖ్యత వి ఎల్ సి ల నిర్వహణ గురించి నవిత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు జగదీశ్వర్, సర్పంచ్ రాజేశ్వరి,రైతు సంఘం అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు నర్సిరెడ్డి, వార్డు సభ్యులు ఆంజనేయులు గౌడ్, యేసు, గ్రామ నాయకులు , జయరామ్, మంగలి కృష్ణయ్య, పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
183 Total Views, 2 Views Today