AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విజయవాడలో గ్రామీణ నీటిపారుదల శాఖ SE ని కలిసిన గిరిజన నేతలు కృష్ణా జిల్లా…

1 min read

AABNEWS : విజయవాడలో గ్రామీణ నీటిపారుదల శాఖ SE ని కలిసిన గిరిజన నేతలు కృష్ణా జిల్లా,ఏ. కొండూరు మండలంలోని గిరిజన తండాలకు కృష్ణా జలాల సరఫరా చేయడానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ చీప్ ఇంజీనీర్ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు విజయవాడలోని గ్రామీణ నీటిపారుదల శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గిరిజన సంఘం నేతలు బి.గోపిరాజు,గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్ బి. చక్రి నాయక్,జిల్లా కార్యదర్శి బి. నాగరాజు డాక్టర్. జ్యోతిలాల్ నాయక్ ,సర్పంచ్ డి.రాముడు,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు బి.వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. రెడ్డిగూడెం మండలం కుదప గ్రామం నందు ఉన్న కృష్ణాజలాల సంపూ నుండి ఏ.కొండూరు మండలంలోని గిరిజన తండాలకు కృష్ణా జలాలు సరఫరా చేయుటకు ప్రభుత్వం సుమారు 40 కోట్ల రూపాయలు అంచనాలు తయారు చేసి ST సబ్ ప్లాన్ నిధుల నుండి మంజూరు అయ్యేలాగా అధికారులు కృషి చేయాలని అన్నారు.అదేవిధంగా RWS శాఖలో గిరిజన ఉద్యోగులు గత 10 సంవత్సరాల నుండి పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నారని,వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలని కోరారు..

 1,770 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.