విజేతలకు బహుమతుల ప్రధానం
1 min read
AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
చిన్నతనం నుండి జిజ్ఞాసను ఏర్పరచుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని. అపారమైన జ్ఞానసంపద
కలుగుతుందని బాలాజీ విద్యాసంస్థల ఛైర్మన్ డా॥ అండృ రాజేంద్రప్రసాద్ రెడ్డి గారు అన్నారు. లక్నవల్లి శివారులోనిబాలాజీ టెక్నోన్కూల్లో ప్రఖ్యాత భారతదేశ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీరామానుజన్ 133వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ శ్రీనివాస రామానుజన్ టాలెంట్ హంట్ పరీక్షలో గలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. గలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్, షీల్డ్ అందించారు. ఈ నెల 20న నిర్వహించిన ఆన్లైన్ వరీక్షలో వరంగల్ రూరల్. వరంగల్ అర్బన్. మహబుబాబాద్,జయశంకర్ భూపాలపల్లి,ములుగు జిల్లాలకు నంబంధించిన 550మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో గెలుపొందిన విద్యార్థులకు
బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.రాజేష్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి వరీక్షలు ఒక ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. తరగతుల వారిగా ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల సెక్రటరీ జి. రాజేశ్వర్ రెడ్డి,ఎఓ సురేష్. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
38 Total Views, 2 Views Today