AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు తరలిరండి

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత నిరాదరణకు గురైన విద్యా రంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుగా తయారైంది.
ధర్నా చౌక్ వద్ద మహాధర్నాలో వేలాదిగా పాల్గొనండి.
| ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రాధినేత ఇచ్చిన హామీలే అమలుకు నోచుకోక విద్యా రంగం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది.
మూడు రోజుల్లో రెండు కమ్మల్లో సర్వీస్ నిబంధనలు రూపొందించి పదోన్నతులు నిర్వహిస్తామని, చప్రాసి నుంచి కలెక్టర్ పిల్లల వరకు
ఒకే పాఠశాలలో చదివేలాగ దేశం గర్వించదగ్గ విద్యా విధానాన్ని అమలు చేస్తామని, మరే రాష్ట్రంలో లేనంత ఎక్కువ వేతనాలు
ఉపాధ్యాయులకు ఉండేలా చేస్తామని, కాంట్రాక్టు పేరుతో ఉన్న వెట్టిచాకిరి విధానాన్ని రద్దుచేసి అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని,
కార్పొరేట్ దోపిడీని అరికడతామని, 2018 జూన్ 2 నుండి ఐ.ఆర్. ఇస్తానని మూడు నెలల్లోనే PRC నివేదిక తెప్పించుకొని అమలు
చేస్తామని, ఒకే పనికి వేర్వేరు కేడర్లు, వేర్వేరు వేతనాలున్న పండిట్, PET లను ఉన్నతీకరిస్తామని గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి
హామీలు ఆచరణలో అమలుకు నోచుకోలేదు, పైగా తన వాగ్దానాలకు పూర్తి విరుద్ధంగా పనిచేస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ,
ఉపాధ్యాయుల పై సమాజంలో వ్యతిరేకత పెంచేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రభుత్వ పాఠశాలల
మూసివేతకు కంకణబద్ధులై పనిచేస్తున్నారు. పాఠశాలల విలీనం, పని సర్దుబాటు, హేతుబద్దీకరణ, UPS ల మూసివేత వంటి కొత్త
కొత్త ఆలోచనలతో సర్కార్ బడి ఉసురు తీసే విధానాలను వేగవంతం చేస్తున్నారు. పాఠశాల, కళాశాల వ్యవస్థల్లో కార్పొరేటీకరణ
చేస్తున్న విధ్వంసం ఇంకా కొనసాగుతుండగానే విశ్వవిద్యాలయాలలో సైతం ప్రైవేట్ కు దారులు తెరిచారు. సంస్కరణల పేరుతో
విద్యారంగాన్ని పెద్ద వ్యాపారస్తులకు , తన అనుయాయులకు అప్పగించారు. ఇది బంధుప్రీతి, రాజకీయ అవినీతి తప్ప మరొకటి కాదు.
మొత్తంగా పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసే విధానాలు అమలు చేసున్నారు. ఉన్నతాధికారుల నుండి మంత్రుల వరకు
స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకునే అవకాశం లేకుండా ఉంది. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడల కారణంగా సమస్యల పరిష్కారం
పక్కన పెడితే, సమస్యలు చెప్పుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంది. సమస్యలపై నిరసనలు తెలిపే క్రమంలో
ఉపాధ్యాయులపై గతమెన్నడూ లేని నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెగించి కొట్లాడుడు తప్ప మరే మార్గం లేదు.
దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల పరిష్కారానికి చేసిన ఐక్య ఉద్యమాల ఫలితంగా 16 మే 2018 న ముఖ్యమంత్రి ఉపాధ్యాయ
సంఘాలతో చర్చించి, పరిష్కారానికి ఇచ్చిన రాతపూర్వక హామీ నీటి మీద రాతల్లా మిగిలిపోయింది. పదోన్నతులు లేకపోవడం వల్ల
అనేకమంది ఉపాధ్యాయులు ఒకే క్యాడర్ లో ఉద్యోగ విరమణ చేస్తున్నారు. విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులను ఉన్నతంగా
గౌరవించి, ప్రభుత్వ మర్యాదలతో ఇంటివద్ద దిగబెడతామని ఊదరగొట్టి , మనోవేదన, ఆర్థిక నష్టాలను మిగిల్చి సాగనంపుతున్నారు.
భార్యాభర్తలు వేర్వేరు చోట్ల వృత్తి విధులు నిర్వహిస్తూ పిల్లల బాగోగులు, కుటుంబ సంసార బాధ్యతలు ఎలా నెరవేరుస్తారని మొసలి
కన్నీరు కార్చి, వెంటనే అంతరజిల్లా బదిలీలు నిర్వహిస్తామని నమ్మబలికి రెండున్నరేండ్లు గడిచినా అతీగతీ లేదు. సర్వీస్ నిబంధనలు,
బదిలీలు లేక 10 ఏండ్లుగా నియమకమైన చోటే పనిచేస్తూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పండిట్, PET లకు ఆర్థిక ప్రయోజనం లేకుండా, పేరు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ గా మార్చుకొనమని అస్పష్ట, అస్తవ్యస్త,
హాస్యాస్పదమైన (ముఖ్యమంత్రి భాషలో నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాని) అప్లేడ్ ఉత్తర్వులు విడుదల చేసి, కొత్త
పంచాయతీకి తెరలేపారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న మాటను మార్చి ఉన్న ఉద్యోగాలను ఊడబీక చూస్తున్నారు. పాఠశాలల్లో
ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచననే పూర్తిగా విస్మరించారు. అనేక యాజమాన్యాలలో కొత్త కొత్త పేర్లతో పాఠశాలలు
నిర్వహిస్తూ వేర్వేరు నిబంధనలు పాటిస్తూ విద్యలో గందరగోళం, వేతనాల్లో బానిసత్వాన్ని కొనసాగిస్తున్నారు. మోడల్ స్కూల్, KGBV,గురుకులాల ఉపాధ్యాయులు కనీసం ఆరోగ్య శ్రీ లేకుండా, హెల్త్ కార్డులు, మెడికల్ రీయంబ్సరెన్స్ మెంట్ కూడా వర్తించక ఆరోగ్య రక్షణ
కొరకు ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నారు. నూతన వేతన సవరణ అమలులో ముఖ్యమంత్రి వాగ్దానాలపై ఆశలతో, గృహ, వ్యక్తిగత
ఋణాలు తీసుకున్న ఉపాధ్యాయుల కుటుంబాల్లో ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేని, చాలీచాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందుల
వల్ల అశాంతి, కలహాలు రేకెత్తుతున్నాయి. ప్రతీ నెలా ఒకటో తారీఖున జీతాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ రుణాలు సకాలంలో
చెల్లించడానికి అప్పులు, చేబదులు తీసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. చివరికి ప్రతీ నెల రావాల్సిన జీతాల గురించి కూడా
ఉద్యమించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారానికి రాకముందు అమానవీయంగా కనపడిన నూతన పెన్షన్
పథకం (CPS) ఇప్పుడు మానవీయతకు చిరునామాగా తోస్తుంది. ఈ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీ దళిత ముఖ్యమంత్రి హామీ
లాగే రదైపోయింది.
ప్రభుత్వం అవలంభిస్తున్న విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను నిలువరించక పోతే భవిష్యత్ మొత్తం అంధకారం
కానుందని అర్థమవుతుంది. విద్యా రంగ పరిరక్షణతో పాటు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఐక్యంగా ఉద్యమిస్తున్న
USPC, JACTO సంఘాలు ప్రభుత్వం మెడలు వంచడానికి మరో దఫా ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. సమస్యల
పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమన్నది చరిత్రలో నిరూపితమైంది. ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలోనూ ఈ సత్యం నమోదై ఉంది.
అదే చరిత్రను పునరావృతం చేయవలసిన అనివార్య పరిస్థితి కళ్ళముందు ఉంది. అందుకే ఇది పోరాటాల సమయం. తెగించి
కొట్లాడితే తప్ప సమస్యలు సమసిపోవు. వెంటాడుతున్న అన్ని సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ కొన్ని సమస్యలను తక్షణ
పరిష్కారం కొరకు ప్రభుత్వం ముందుంచడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారానికి మూడు విడతల పోరాట కార్యాక్రమాలకు
JACTO, USPCలు పిలుపునిచ్చాయి.
డిసెంబర్ 9, 10 తేదీల్లో అన్ని పాఠశాలల్లో భోజన విరామ నిరసన ప్రదర్శనలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసిన
ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తూ, 17 న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహారదీక్షలు, 29 న హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద
మహాధర్నాను వేలాదిమందిగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు సేవనాయక్ గారు మరియు పొలిటికల్ పార్టీలు యూవ నాయకులు కిషన్ గారు

 146 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.