AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విద్యా వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలి…

1 min read

AAB NEWS : పాఠశాలల బోధనే ఉపాధిగా జీవిస్తున్న విద్యావాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ కోరారు మంగళవారం కొడంగల్ పట్టణ కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో మండలంలోని 48మంది విద్యావాలంటీర్ల కు నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేశారు కిసాన్ సే వర్గం ఫౌండేషన్ వారి ఇ సహకారంతో అత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి విద్యార్థులను కాపాడుకునేందుకు గాను ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి దీంతో నిరుద్యోగులైన విద్యావాలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారిందని అందుకు సంస్థల సహాయంతో విద్యావాలంటీర్ల కు నిత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. అందుకు సహకారం అందించిన కిసాన్ బంధు, టీమ్5 సంస్థలకు, సంస్థల ప్రతినిధులు సతీష్, స్నేహ, సేవోద్గం ఫౌండేషన్ జయశ్రీ లకు కు కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగులైన విద్యావాలంటీర్లు ఆర్థిక పరిస్థితుల వల్ల ఆత్మ స్థైర్యం కోల్పోయి రాదని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇటీవల జరిగిన ఓ విద్యా వాలంటీర్లు ఆత్మహత్య సంఘటన బాధాకరమని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులైన విద్యా వలంటీర్లకు ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబోధనలో విద్యా వాలంటీర్లు అందిస్తున్న సేవలు కొనియాడ తప్పదని ఎంఈఓ కే.రామ్ రెడ్డి అన్నారు. పాఠశాలలు ప్రారంభంకాగానే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే విద్యావాలంటీర్లకు ఉపాధి కల్పించి భరోసా ఇస్తామన్నారు. కిసాన్ బందు సంస్థ వ్యవస్థాపకులు సతీష్, స్నేహ, విక్రమ్, సేవోద్గం ఫౌండేషన్ జయశ్రీలకు విద్యా వలంటీర్లు కృతజ్ఞతలు తెలిపారు . సంస్థలు అందించిన సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా నాయకులు బాకారం చంద్రశేఖర్, అనిల్ కుమార్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు క్రాంతికుమార్, వీరేశం, బసప్ప, అబ్దుల్ హాక్, సీఆర్ పిలు శ్రీనివాస్, దస్తప్ప, జమిరోద్దీన్, సిబ్బంది రాఘవేందర్, వెంకటయ్య, విద్యా వాలంటీర్లు జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు.

 837 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.