AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో నిండు ప్రాణం బలి….

1 min read

AABNEWS : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో నిండు ప్రాణం బలి.బోథ్ మండల కేంద్రం లోని గౌస్ (30)అనే యువకుడు ప్రమాద వశాత్తు విద్యుత్ ఘాతం తో మృతి చెందాడు.వివరాల్లోకి వెలితే మండలకేంద్రం లోని ప్రగతి స్కూల్ ముందర గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు గౌస్ అనే యువకుడు ప్రమాదవశాత్తు తగిలి షాక్ సర్క్యూట్ తో మరణించినట్లు బంధువులు తెలిపారు.అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ రోడ్డు కు అనుకుని,కరెంట్ పోల్ కు పూర్తిగా క్రింద ఏర్పాటు చేసారు. దాని ముందరనే స్కూల్ ఉంది. దాన్ని మార్చాలని,దాని వలన విద్యుత్ ఘాతంతో ప్రజలు ప్రమాదాల బారిన పడతారని చాలా సార్లు చెప్పినప్పటికీ ఏఈ పట్టించు కోలేదని అన్నారు. విద్యుత్ అధికారుల కు ఎన్ని సార్లు చెప్పిన ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను తీయక పోవడంతోనే ఒక నిండు ప్రాణం బలి అయిందని ప్రజలు ఆరోపించారు.విద్యుత్తు ఏ. ఈ.ను విధులనుండి తొలగించాలని డిమాండ్ చేశారు.ఏ.ఈ.పై చర్య తీసుకోవాలని బంధువులు ఆందోళనకు దిగారు. బోథ్ ఎస్.ఐ రాజు ఆందోళన కారులను సముదాయించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 830 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.