AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో సామాన్యులు బలవుతున్నారు…

1 min read

AABNEWS :

విస్సన్నపేట : కలగర గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన కె.అర్జున అనే కరెంటు వినియోగదారుడు సర్వీస్ నెంబర్ 264 తన పేరుమీద ఉన్న కరెంటు మీటరు స్టక్ అయ్యి ,బిల్లు రావడం లేదు అని , పలుమార్లు మీటరు మార్చమని లేదా బిల్లు ఎందుకు రావటం లేదని లైన్మెన్ ద్వారా ఏ .ఈ . విజయ్ భాస్కర్ దృష్టికి పలుమార్లు తెలియ పరచడం జరిగింది అని, చూద్దాములే, చేద్దాంలే, అని విద్యుత్ శాఖ అధికారులు కాలయాపన చేయడం జరిగిందని, ఈ లోపు లో విజిలెన్స్ అధికారులు తమ ఇంటి దగ్గరకు వచ్చి బిల్లు ఆడగా బిల్లు ఇవ్వకుండా మినిమం బిల్లని రెండు నెలలకు ఒకసారి తమ దగ్గర నుంచి కొంత నగదును విద్యుత్ శాఖ అధికారులు తీసుకుంటున్నారని విజిలెన్స్ అధికారులకు బాధితులైన అర్జున చెప్పగా వారు బిల్లు లేకుండా కరెంటు వాడకూడదని తనపై అన్యాయంగా 12 వేల రూపాయలు కేసు రాశారని, విద్యుత్ శాఖ అధికారులు మీటర్ మార్చిన బిల్లు ఎందుకు రావడం లేదని చెక్ చేసిన తనపై విజిలెన్స్ అధికారులు కేసు రాసేవారు కాదని బాధితుడు లబోదిబోమంటూ మీడియాను ఆశ్రయించాడు. గతంలో ముందు 2000 కట్టండి అని తన దగ్గర డబ్బులు ఏ ఈ సమక్షంలో డబ్బులు విజిలెన్స్ వారు కట్టించుకుని మరల ఐదు నెలల తర్వాత విద్యుత్ శాఖ అధికారులు తమ ఇంటికి వచ్చి మిగిలిన పది వేలు కడితే గాని నీకు కరెంట్ సప్లై ఇస్తాం అని, కరెంట్ సప్లై తీయడం జరిగిందని, స్థానిక విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల తనపై కేసు బనాయించారని ఎస్సీ కులానికి చెందిన వారికి 200 యూనిట్లు వరకు ఫ్రీగా ఇస్తున్న , అన్నం తినే వాడు ఎవడైనా దొంగతనంగా కరెంటు వాడాలి అనే ఆలోచన వస్తుందా అని తనపై అన్యాయముగా కేసు బనవించటనికి కారణమైన విస్సన్నపేట ఏ.ఈ. విజయ్ భాస్కర్ , కలగర లైన్మెన్ లాల్ సింగ్ పై విచారణ జరిపి విద్యుత్ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇటీవల విస్సన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమీక్ష సమావేశంలో రైతులు విద్యుత్ శాఖ ఏ ఈ విజయభాస్కర్ పనితీరుపై రైతులు పెద్ద ఎత్తున స్థానిక శాసనసభ్యులు రక్షణ నిధి దృష్టికి తీసుకెళ్లగా సాక్షాత్తు శాసనసభ్యులు ఏ ఈ విజయ భాస్కర్ నీ పనితీరు మార్చుకొని రైతులు మరియు ప్రజలు దగ్గర్నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేయాలని మందలించిన కుక్క తోక వంకర అన్న చందంగా ఏఈ విజయభాస్కర్ తీరు మార్చుకోకుండా మరల పాత పద్ధతిలో రైతులకు ప్రజలకు సకాలంలో విద్యుత్ సదుపాయం కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పలువురు ఆవేదన తెలియజేస్తున్నారు.వివరణ ఇదే విషయంపై ఏ.ఈ. విజయ్ భాస్కర్ నీ వివరణ అడగగా నాకు సంబంధం లేదు మీరు ఏమైనా చేసుకోండి నన్నేం చేయలేరు అంటూ బెదిరించే ధోరణిలో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

 9,574 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.