AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెద్దగట్టు లింగమంతుల స్వామీ జాతర…

1 min read

AABNEWS : అంగరంగ వైభవంగా , కన్నులపండుగగా, పెద్దగట్టు లింగమంతుల స్వామీ జాతర గంపల ప్రదర్శన చేస్తూ, బోనాలు, పోలు ముంతలు,పసుపు బియ్యం సమర్పిస్తూ మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటర్లు, డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి చేరుకొని మొక్కులు చెల్లిస్తున్న భక్తులు….
తెలంగాణ నలు మూలల నుంచి, AP, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రంల నుంచి కూడా లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు దూరజ్ పల్లి గుట్ట , సూర్యపేట పట్టణం అంత భక్తులతో ఇసుకేస్తే రాలనంత రద్దీ అక్కడే మకాం వేసి జాతర లో సకల సౌకర్యాలు కల్పించిన మంత్రి జగదీష్ రెడ్డి….దాదాపు 10 కోట్లతో సదుపాయాలు 10 వైద్య బృందాలు షిఫ్ట్ ల వారిగా 24 గంటల వైద్య సేవలు
1000 మంది మున్సిపల్ సిబ్బంది తో 24 గంటలు శానిటేషన్ పనులు నిరంతర తాగు నీటి సౌకర్యం, విద్యుత్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కొత్తగా స్వామివారి కి మహామండప నిర్మాణం 40 సీసీ కెమెరాలు 1500 మంది పోలీసు సిబ్బందితో బారి భద్రత జాతర నేపథ్యంలో హైదరాబాద్ to విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళవలసిన వాహనాలను నార్కెట్ పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లింపు ఇవ్వాళ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్న రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి..తలసాని .కోవిడ్ నేపథ్యంలో జాతర పరిసరాలను, గుట్ట పైన అనునిత్యం శానిటేషన్ పనులు జాతర ను 10 జోన్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్న కలెక్టర్ 300 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న ఈ జాతర ప్రతి రెండేళ్ల కోసారి నిర్వహిస్తారు…యాదవుల ఇలావేల్పు లింగమంతుల స్వామి, , యలమంచిలమ్మ, గంగమ్మ,, శివుడి సోదరి సౌడమ్మ లు,కొలువైన పెద్దగట్టు తమ సంపదలైన గొర్ల జువాలను తమను మృగల నుంచి కాపాడాలని లింగమంతుల స్వామి ని మొక్కుకుంటున్న యాదవులు.

 394 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.